Karnataka: 'మోదీజీ నన్ను కాపాడండి- నా భార్య చావగొడుతోంది'

ABP Desam   |  Murali Krishna   |  02 Nov 2022 05:27 PM (IST)

Karnataka: భార్య తనను చంపేస్తుందని, కాపాడాలని ప్రధాని మంత్రి మోదీని ట్విట్టర్‌లో సాయం కోరాడు ఓ వ్యక్తి.

'మోదీజీ నన్ను కాపాడండి- నా భార్య చావగొడుతోంది'

Karnataka: ఓ భార్యా బాధితుడు.. ఏకంగా ప్రధాని కార్యాలయానికే ఫిర్యాదు చేశాడు. తన భార్య తనను కొడుతుందటూ కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి ఆరోపించాడు. తనను కాపాడాలని ట్విట్టర్‌లో కోరాడు.

ఇదీ సంగతి

బెంగళూరుకు చెందిన యదునందన్ ఆచార్య.. అక్టోబర్‌ 29న ఓ ట్వీట్‌ చేశాడు. భార్య తనపై కత్తితో దాడి చేసిందని, తనను ఎవరైనా రక్షించాలని కోరాడు.

నాకు ఎవరైనా సహాయం చేస్తారా? ఎందుకంటే నేను పురుషుడ్ని. నా భార్య నాపై కత్తితో దాడి చేసింది. మీరు గొప్పగా చెప్పే నారీ శక్తి ఇదేనా? నేను ఆమెపై గృహ హింస కేసు పెట్టవచ్చా? లేదా?                                             -        యదునందన్ ఆచార్య, బాధితుడు

తన చేతి నుంచి రక్తం కారుతున్న ఫొటోను కూడా పోస్ట్‌ చేస్తూ ఈ ట్వీట్ చేశాడు బాధిత వ్యక్తి. తనను చంపుతానని భార్య బెదిరిస్తుందన్నాడు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డికి కూడా ఈ ఫ్యిరాదు ట్వీట్‌ను ట్యాగ్ చేశాడు.

పోలీసులు

 

ఈ ట్వీట్‌పై బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి స్పందించారు. సమీప పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసి న్యాయ సహాయం పొందవచ్చని యదునందన్ ఆచార్యకు ట్విట్టర్‌ ద్వారా బదులిచ్చారు.

Also Read: Morbi Bridge Collapse: 'వారిపైనేనా మీ ప్రతాపం- వంతెన కూలిన ఘటనపై సీబీఐ, ఈడీ చర్యలేవి?'

Published at: 02 Nov 2022 05:27 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.