ABP  WhatsApp

Heeraben Modi Health: 'మోదీజీ, మా ప్రేమ, మద్దతు మీకు తోడుగా ఉంటాయ్'- రాహుల్ గాంధీ ట్వీట్

ABP Desam Updated at: 28 Dec 2022 04:29 PM (IST)
Edited By: Murali Krishna

Heeraben Modi Health: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

రాహుల్ గాంధీ ట్వీట్

NEXT PREV

Heeraben Modi Health: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. ఈ మేరకు బుధవారం ఓ ట్వీట్ చేశారు. ఆరోగ్యం బాలేకపోవడంతో అహ్మదాబాద్‌లో యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో హీరాబెన్ చికిత్స తీసుకుంటున్నారు.







తల్లి, కొడుకుల మధ్య ఉండే ప్రేమ.. శాశ్వతమైనది, వెలకట్టలేనిది. మోదీ జీ.. ఈ కష్ట సమయంలో నా ప్రేమ, మద్దతు మీకు తోడుగా ఉన్నాయి. మీ తల్లి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత


ప్రియాంక గాంధీ


ప్రియాంక గాంధీ కూడా ఈ మేరకు ట్వీట్ చేశారు. మోదీ తల్లి త్వరగా కోలుకోవాలని ఆమె ప్రార్థించారు.







ప్రధాని నరేంద్ర మోదీజీ తల్లి అనారోగ్యంతో ఉన్నారని వార్త వచ్చింది. ఈ క్షణం మేమంతా ఆయనతో ఉన్నాం. ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.                               -    ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి


వీరితో పాటు పలువురు కేంద్రమంత్రులు, భాజపా నేతలు కూడా హీరాబెన్ మోదీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో సహా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకులు ఆమె పరిస్థితి గురించి ఆరా తీయడానికి ఆసుపత్రికి చేరుకున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.


మోదీ


ప్రస్తుతం హీరాబెన్ మోదీ.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆసుపత్రిలో చేరిన తల్లిని పరామర్శించేందుకు ప్రధాని మోదీ కూడా అహ్మదాబాద్ చేరుకున్నారు.


Also Read: Kerala Crime News: కేరళలో దారుణం- బాలికను గొంతుకోసి చంపిన యువకుడు!


 

Published at: 28 Dec 2022 04:24 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.