Kerala Crime News: కేరళలో దారుణం జరిగింది. తిరువనంతపురం, వర్కల అనే ప్రాంతంలో ఓ బాలికను.. యువకుడు గొంతుకోసి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ జరిగింది
వర్కల ప్రాంతానికి సమీపంలో ఉన్న వడ్డేసరికోనం అనే గ్రామంలో బుధవారం తెల్లవారుజామున 17 ఏళ్ల బాలిక రక్తపు మడుగులో కనిపించింది. ఆ బాలికను గొంతు కోసి చంపినట్లు గుర్తించారు. గోపు (20) అనే యువకుడితో బాలిక కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిసింది. అతనే ఈ హత్య చేసినట్టు గుర్తించిన పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
మృతురాలు కాలేజీ విద్యార్థిని అని, అర్ధరాత్రి సమయంలో బయటకు పిలిచి యువకుడు కత్తితో గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
గోపు కత్తితో దాడి చేయటంతో బాధితురాలు గట్టిగా కేకలు వేయటంతో ఆమె ఇంట్లోవాళ్లు, ఇరుగుపొరుగు వారు వచ్చి చూడగా ఆమె నెత్తుటి మడుగులో పడిపోయి కనిపించింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
కేసు దర్యాప్తు
మృతురాలు లోకల్ కాలేజీలో చదువుతుంది. నిందితుడు గోపు పళ్ళికల్ అదే ప్రాంతానికి సమీపంలో ఉంటున్నాడు. బాధితురాలి మొబైల్ ఫోనులోని వివరాల ఆధారంగా గోపును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Iranian Woman: హిజాబ్ లేకుండానే చెస్ టోర్నీలో పాల్గొన్న ఇరాన్ యువతి