PM Modi Mother Health Update: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ (100)ని ఆసుపత్రికి తరలించారు. ఆమె అస్వస్థతకు గురికావడంతో అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇటీవల ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని మోదీ తన తల్లిని కలిశారు. గుజరాత్‌లో రెండో దశ పోలింగ్‌కు ఒకరోజు ముందు డిసెంబర్ 4న.. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని తన తల్లి నివాసానికి వెళ్లిన మోదీ.. ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు, జూన్ 18న ఆమె 100వ పుట్టినరోజు సందర్భంగా తల్లి హీరాబెన్‌తో ప్రధాని మోదీ గడిపారు.
సోదరుడికి
ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీకి కర్ణాటకలోని మైసూరులో మంగళవారం యాక్సిడెంట్ జరిగింది. ఈ కారు ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. ప్రహ్లాద్ మోదీ తన కుటుంబంతో కలిసి బందీపుర్‌కు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
మీడియా కథనాల ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో ప్రహ్లాద్ మోదీ భార్య, కుమారుడు మెహుల్, కోడలు, మనవడు మేనత్‌లు ఆయన వెంట ఉన్నారు. మెర్సిడెస్ బెంజ్‌లో ఆయన తన కాన్వాయ్‌తో పాటు బందీపుర్‌కు వెళుతుండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో కారు డివైడర్‌ను ఢీకొట్టింది.
టైమ్స్ నౌ ప్రకారం.. ప్రహ్లాద్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం JSS ఆసుపత్రిలో చేర్చారు. కడ్కోళ్ల అనే ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆయన డ్రైవర్ సత్యన్నారాయణకు కూడా గాయాలయ్యాయి. ప్రహ్లాద్ మోదీకి ప్రమాదం తప్పినట్లు సమాచారం.
ప్రహ్లాద్ మోదీ.. ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. 66 ఏళ్ల ప్రహ్లాద్.. 2001లో సంస్థ స్థాపించినప్పటి నుంచి అందులో ఉన్నారు. హీరాబెన్ మోదీకి జన్మించిన ఆరుగురు పిల్లలలో ప్రహ్లాద్ నాలుగో సంతానం.
Also Read: Bharat Jodo Yatra: 'జోడో యాత్రకు భద్రత కల్పించండి'- అమిత్ షాకు కాంగ్రెస్ లేఖ