Bharat Jodo Yatra: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. రాహుల్ గాంధీతో పాటు భారత్ జోడో యాత్రలో పాల్గొనే ప్రజలందరికీ భద్రత కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని లేఖలో కాంగ్రెస్ పేర్కొంది. 

Continues below advertisement




డిసెంబర్ 24న దిల్లీలో అడుగుపెట్టిన జోడో యాత్రకు పోలీసులు ఎలాంటి రక్షణ కల్పించలేదని కాంగ్రెస్ ఆరోపించింది. రాహుల్ గాంధీ సహా యాత్రికుల భద్రతపై దిల్లీ పోలీసులు నిర్లక్ష్యం వహించారని, ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నారని కాంగ్రెస్ పేర్కొంది.