Telangana News Today | తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు బిగ్ అలర్ట్ - భారీ వర్షాలతో ఈ రైళ్లు రద్దు, ద.మ రైల్వే కీలక ప్రకటన
భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. రహదారులపైకి నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలోని 8 జిల్లాలు, తెలంగాణలోని 11 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఆది, సోమవారాల్లో దాదాపు 30 రైళ్లు రద్దు కాగా.. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఏపీలో 100 పునరావాస కేంద్రాల ఏర్పాటు, వేల మంది తరలింపు - వంగలపూడి అనిత
రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు బారిన పడిన 294 గ్రామాలకు చెందిన 13,227 మందిని పునరావాస కేంద్రాలకు తరిలించామని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తాడేపల్లిలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఆదివారం ప్రస్తుత వరద పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అధిక వర్షాల కారణంగా ఇంత వరకు 100 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 13,227 మందిని తరలించామన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండ చరియలు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కాగా.. రహదారులపై నీరు చేరి రాకపోకలు బంద్ అయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు ఘాట్ రోడ్డులో భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడ్డాయి. మూలమలుపు వద్ద పలు చోట్ల పెద్ద బండరాళ్లు జారి కిందపడగా.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు కొండ దిగువన ఉన్న చెక్ పోస్ట్ వద్ద వాహనాలను నిలిపేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి



హైడ్రా కూల్చివేతల్ని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ - మంచి వ్యూహమేనా ?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కూల్చివేతల అంశం హైలెట్ అవుతోంది.  హైడ్రా పేరుతో కొత్త వ్యవస్థను ఏర్పాటు  చేసిన రేవంత్ రె్డి చెరువుల ఆక్రమణ దారులకు ట్రయిలర్ చూపిస్తున్నారు. అక్రమాలపై పోరాటంలో రేవంత్ రెడ్డి తెగువ చూపిస్తున్నారని ఆయనకు అండగా ఉండాలన్న అభిప్రాయం ప్రజలకు వచ్చేలా చేసుకోగలిగారు. దీంతో హైడ్రా కూల్చివేతలకు ప్రజల మద్దతు లభిస్తోంది. వీలైనంత వరకూ ప్రజలకు ఇబ్బంది కగలకుండా.. పెద్దల ఆక్రమణలను కూల్చేస్తున్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 


వర్షాలపై సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష, 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. సీనియర్ మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో ఫోన్లో రివ్యూ చేసి సీఎం రేవంత్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సీఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్,  పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలి కాన్ఫరెన్స్ లో ఆదేశించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి