Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి.. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుక్ మాండవీయ లేఖ రాశారు. భారత్ జోడో యాత్రలో కొవిడ్ -19 మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఈ లేఖలో కోరారు. లేకుంటే.. జోడో యాత్రను వాయిదా వేసుకోవాలని తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌లకు లేఖ రాశారు.
లేఖ వల్ల
'భారత్ జోడో యాత్ర' కారణంగా తమ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తూ రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు ఎంపీలు డిసెంబరు 20న కేంద్ర మంత్రి మన్‌సుక్ మాండవీయకు లేఖ రాశారు. జోడో యాత్రలో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని వారు కోరారు. మాస్క్‌లు, శానిటైజర్లు ఉపయోగించాలని, వ్యాక్సిన్ వేసుకున్నవారినే యాత్రకు అనుమతించాలని కోరారు. ఈ లేఖపై స్పందించిన మన్‌సుక్ మాండవీయ.. రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కు లేఖలు రాశారు.
కాంగ్రెస్ కౌంటర్
కేంద్ర ఆరోగ్య మంత్రి లేఖపై కాంగ్రెస్ ఫైర్ అయింది. ఇటీవల గుజరాత్ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ భారీ రోడ్ షోను ప్రస్తావిస్తూ ఆ సమయంలో నిబంధనలు గుర్తుకు రాలేదా అంటూ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి కౌంటర్ ఇచ్చారు.
Also Read: Coronavirus: ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్- భారత్‌లో టెన్షన్ టెన్షన్!