Elon Musk: మరో సంచలనానికి బిలియనీర్ ఎలన్ మస్క్ సిద్ధమయ్యారు. ట్విట్ట్ సీఈవో పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ట్విటర్ అకౌంట్‌ ద్వారా ఎలన్ మస్క్ తెలియజేశారు. ప్రజాభిప్రాయం ప్రకారం తప్పుకుంటానని చెప్పారు. 


ఎలన్ మస్క్ ఏమి చెప్పారంటే?


ఎలన్‌ మస్క్ తన ట్వీట్‌లో ఏం చెప్పారంటే... ఈ సీఈవో పదవి చేపట్టడానికి సరైన అర్హత, తెలివైన వ్యక్తి దొరికిన వెంటనే రాజీనామా చేస్తానన్నారు. ఆ తర్వాత వాళ్లు ఓ సాఫ్ట్ వేర్‌ను మాత్రమే రన్ చేస్తారని... సర్వర్ టీమ్‌ను మాత్రమే చూస్తారని సటైర్లు వేశారు. 






మంగళవారం వచ్చిన సిఎన్బిసి నివేదిక ప్రకారం... ఎలన్ మస్క్ ట్విట్టర్‌కు కొత్త సీఈవో వెతికే పనిలో చాలా యాక్టివ్‌గా ఉన్నారని తెలిసింది. ఎలన్ మస్క్ ట్విట్టర్ పోల్ నిర్వహించారు. దీనిలో ట్విట్టర్ సీఈఓ పదవికి తాను రాజీనామా చేయాలా అని అడిగారు. ఈ పోల్‌పై చాలా మంది రియాక్ట్ అయ్యారు. వచ్చిన మొత్తం ఓట్లలో 57.5 శాతం మంది నెటిజన్లు ఎలన్ మస్క్ పదవి నుండి వైదొలగాలని చెప్పి ఓటు వేశారు. ఆయన వ్యతిరేకంగా ఈ ఓట్లు వచ్చాయి. ఆయన రాజీనామా చేయాలని వాళ్లంతా అభిప్రాయపడ్డారు. 


ఈ పోలింగ్‌ ఫలితం తనకు వ్యతిరేకంగా వస్తుందని ముందే ఎలన్‌ మస్క్ ఊహించారు. ట్విట్టర్ బాధ్యతలు స్వీకరించిన 2 నెలల్లో చాలా మార్పులకు ప్రయత్నించారు. విటిపై చాలా వ్యతిరేకత వ్యక్తమైంది. అందుకే పోల్ ఫలితాలను అనుసరించే నిర్ణయాలు తీసుకుంటానని ఆదివారం ప్రకటించారు. నెటిజన్లు కోరుకుంటే ట్విట్టర్ సీఈఓ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. 


మొత్తం ఫలితం ఆయనకు వ్యతిరేకంగా వచ్చినందున సీఈవో పదవి నుంచి తప్పుకుంటానంటూ ఎలన్ మస్క్ ప్రకటించారు. తన మాటను ఎప్పుడు పాటిస్తారో చెప్పకపోయినా... ఈ పదవికి వారుసులు లేరని మాత్రం స్పష్టం చేశారు. దీంతో ఎలన్‌ మస్క్‌ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న సస్పెన్స్‌ ప్రస్తుతానికి నెలకొంది. 


అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ హ్యాండిల్‌ను పునరుద్ధరించడానికి ఒక పోల్‌ పెట్టారు మస్క్‌. మెజారిటీ ప్రజల నిర్ణయం ప్రకారం, ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించారు. ఇప్పుడు కూడా, మెజారిటీ ప్రజల తీర్పు ప్రకారమే ఎలాన్‌ మస్క్‌ నడుచుకుని, ట్విట్టర్‌ హెడ్‌ పదవి నుంచి దిగిపోతానని ప్రకటించారు. ఇందులో మరో మెలిక కూడా పెట్టారు. 




 



Also Read: ట్విట్టర్‌ పదవికి రాజీనామా చేయమంటారా?, మస్క్‌ ఓటింగ్‌లో షాకింగ్‌ రిజల్ట్‌