నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)పై కొన్నాళ్ళ క్రితం ఓ విమర్శ వినిపించేది. ప్రతి సినిమాలో ఆయన ఒకే విధంగా ఉంటున్నారని! లుక్స్ మీద సరిగా కాన్సంట్రేట్ చేయడం లేదని! కానీ, ఈ మధ్య కాలంలో వచ్చిన ఆయన సినిమాలు చూస్తే... లుక్స్ పరంగా ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. దర్శకులు కూడా బాలకృష్ణను కొత్తగా చూపిస్తున్నారు.


'వీర సింహా రెడ్డి'లో మూడు లుక్కులు!
సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy Movie) సినిమాతో నందమూరి బాలకృష్ణ సందడి చేయనున్నారు. అందులో ఆయనది డ్యూయల్ రోల్. ఆ న్యూస్ తెలిసిందే. లేటెస్ట్ టాక్ ఏంటంటే... అందులో ఆయన మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తారట.


'వీర సింహా రెడ్డి'లో ఫ్యాక్షన్ లీడర్ లుక్ ఫస్ట్ విడుదల చేశారు. అది తండ్రి క్యారెక్టర్. రెండోది కుమారుడి క్యారెక్టర్. ఇటీవల విడుదలైన 'సుగుణ సుందరి'లో ఆ లుక్ అంతా చూశారు. కథానుగుణంగా కుమారుడు విదేశాల్లో ఉంటాడు. అప్పటి లుక్ అది. ఆ తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత కుమారుడి లుక్‌లో చేంజెస్ ఉంటాయని తెలిసింది. 


బాలకృష్ణకు దర్శకుడు గోపీచంద్ మలినేని వీరాభిమాని. లుక్స్ పరంగా మరింత కేర్ తీసుకుని, అభిమానులు కోరుకునే విధంగా చూపించారట. సాధారణంగా కమర్షియల్ సినిమాల రన్ టైమ్ రెండున్నర గంటల లోపు ఉండేలా దర్శక నిర్మాతలు జాగ్రత్త పడతారు. అంత కంటే ఎక్కువ ఉన్న సినిమాలు భారీ విజయాలు సాధించాయి. అందులో 'అఖండ' ఒకటి. ఆ సినిమా రన్ టైమ్ రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు. ఇప్పుడు 'వీర సింహా రెడ్డి' రన్ టైమ్ కూడా అటు ఇటుగా అంతే ఉంటుందని సమాచారం.


ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'వీర సింహా రెడ్డి' చిత్రీకరణ దాదాపు పూర్తి అయ్యింది. టోటల్ టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఒక్క సాంగ్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. త్వరలో బాలకృష్ణ, హీరోయిన్ శృతి హాసన్ (Shruti Hassan) మీద ఆ పాటను తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఆల్రెడీ విడుదలైన 'జై బాలయ్య...', 'సుగుణ సుందరి...' పాటలకు మంచి స్పందన లభిస్తోంది.


Also Read : షూటింగ్‌కు హీరోయిన్ డుమ్మా - సీరియస్ అయిన బాలకృష్ణ


వాస్తవ ఘటనల ఆధారంగా 'వీర సింహా రెడ్డి'
ఫ్యాక్షన్ సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది బాలకృష్ణ. 'సమర సింహా రెడ్డి', 'నరసింహ నాయుడు' ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. అలాగే, 'సింహా' టైటిల్‌తో వచ్చిన బాలకృష్ణ సినిమాలు భారీ విజయాలు సాధించాయి. 'వీర సింహా రెడ్డి'లో కూడా సింహా ఉంది. సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. టైటిల్ సెంటిమెంట్ మాత్రమే కాదు... సినిమాలో అద్భుతమైన కంటెంట్ కూడా ఉందని తెలుస్తోంది. వాస్తవ ఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది.  


హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar), మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర (Naveen Chandra), మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Also Read : కథ వినకుండా 'పుష్ప' ఓకే చేసిన బన్నీ - సెకండ్ పార్ట్ మీద హైప్ చేస్తున్న టీమ్