నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అంటే ప్రేక్షకుల్లో ఓ విధమైన ఇమేజ్ ఉండేది. ఆయన సీరియస్‌గా ఉంటారనే టాక్ ఉండేది. అయితే, ఇది అంతా 'అన్‌స్టాపబుల్' టాక్ షో స్టార్టింగ్‌కు ముందు! ఆ షో వచ్చిన తర్వాత బాలకృష్ణ ఇమేజ్ పూర్తిగా మారింది. ఇప్పుడు అందరూ ఆయనలో చిలిపి కృష్ణుడిని మాత్రమే చూస్తున్నారు.
'అన్‌స్టాపబుల్' ఫస్ట్ సీజన్ కంటే సెకండ్ సీజన్‌లో బాలకృష్ణ బిహేవియర్ మరింత సరదాగా మారింది. యువ హీరోలతో కలిసి ఆయన చేసిన సందడి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విశ్వక్ సేన్ 'ధమ్కీ' సినిమా ప్రెస్‌మీట్‌కు కూడా ఆయన అటెండ్ అయ్యారు. అటువంటి బాలకృష్ణ ఇప్పుడు ఓ సెట్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
గంట వెయిట్ చేసిన బాలకృష్ణ
బాలకృష్ణ ఈ మధ్య ఓ సెట్‌కు వెళ్ళారు. టైమ్ పంక్చ్యువాలిటీకి ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. టైమ్ అంటే టైమే. యథావిధిగా ఆయన వచ్చేశారు. అయితే, ఆ రోజు హీరోయిన్ డుమ్మా కొట్టింది. బాలకృష్ణ గంటసేపు సెట్‌లో వెయిట్ చేసిన తర్వాత ఆయనకు అసలు విషయం తెలిసింది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళపై సీరియస్ అయినట్లు ఇండస్ట్రీ టాక్. ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళు చాలా టెన్షన్ పడ్డారట.
బాలకృష్ణది తప్పేం లేదని, ఆయనకు ముందుగా సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఆ రోజు అలా జరిగిందని తెలుస్తోంది. హీరోయిన్ సైడ్ మనుషులు చెప్పే వెర్షన్ మరోలా ఉంది. ఆ రోజు షూటింగ్‌కు అటెండ్ కావడం కుదరదని ఆమె టీమ్ ముందుగా ఇన్ఫర్మేషన్ అందించిందని, కానీ అది బాలకృష్ణకు చెప్పలేదని చెబుతున్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా ఒక రోజు షూట్ క్యాన్సిల్ అయ్యింది. తర్వాత మరో రోజు ఆ షూట్ చేశారు. బాలకృష్ణ కోప్పడింది ఏ సెట్‌లో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Also Read : ఫుడ్ బిజినెస్‌కు నయనతార సినిమా దెబ్బ కొడితే ఎలా?
ఇప్పుడు బాలకృష్ణ వెరీ బిజీ. ఒక వైపు 'అన్‌స్టాపబుల్' సీజన్ 2 కోసం షూటింగ్ చేస్తున్నారు. మరో వైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ చేస్తున్నారు. కొత్త కథలు కూడా వింటున్నారు. ఏపీలో ఎన్నికలకు ముందు రాజకీయ నేపథ్యంలో ఓ సినిమా చేసే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పే మాట.
'అన్‌స్టాపబుల్ 2' విషయానికి వస్తే... బాలకృష్ణ ఇంటర్వ్యూ చేస్తే? మామూలుగా ఉండదు. ఆయన అలవోకగా, చాలా సింపుల్‌గా క్లిష్టమైన ప్రశ్నలను సెలబ్రిటీల ముందు ఉంచుతున్నారు. సెలబ్రిటీలూ అంతే సరదాగా మనసులో మాట చెబుతున్నారు. ఇప్పుడు రాశీ ఖన్నా చేత ఆమె క్రష్ గురించి చెప్పారు.
విజయ్ దేవరకొండ అంటే...
ఈతరం కథానాయికల్లో రాశీ ఖన్నా (Raashi Khanna) ఒకరు. ఆమె అంటే పడిచచ్చే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. ఆమె తమ క్రష్ అని చెప్పుకొంటారు. మరి, రాశీ ఖన్నా క్రష్ ఎవరు? 'నువ్వు యాక్ట్ చేసిన హీరోల్లో ఎవరి మీద నీకు క్రష్ ఉంది?' అని ఆమెను బాలకృష్ణ అడిగారు. అప్పుడు ''విజయ్ దేవరకొండ అనుకుంటున్నాను'' అని ఆమె సమాధానం ఇచ్చారు. సీనియర్ హీరోయిన్లు జయప్రద, జయసుధలతో పాటు రాశీ ఖన్నా కూడా ఈ వారం 'అన్‌స్టాపబుల్ 2' ఎపిసోడ్‌లో సందడి చేయనున్నారు.
Also Read : హీరోపై చెప్పుతో దాడి - పునీత్ రాజ్‌కుమార్ బతికుంటే సపోర్ట్ చేసేవాడా?