Happy New Year 2023 Live: షురూ అయిన కొత్త సంవత్సర వేడుకలు, న్యూజిలాండ్‌లో గ్రాండ్ వెల్‌కమ్
Happy New Year 2023 Live: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం ప్రతి ఇంట్లో ఆరోగ్యం, ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. మెరుగైన ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తన సంక్షేమ అభివృద్ధి ఎజెండాను కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు.
Background
Happy New Year 2023 Live
న్యూ ఇయర్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే అందరూ కొత్త ఏడాది మూడ్‌లోకి వెళ్లిపోయారు. సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. 2022కి గుడ్‌బై చెప్పి..2023కి వెల్‌కమ్ చెప్పేందుకు ఫుల్ జోష్‌తో ఎదురు చూస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఈ ఏడాది మొట్టమొదటగా కొత్త సంవత్సరం జరుపుకునేది ఎక్కడో తెలుసా..? పసిఫిక్ ద్వీపమైన Tongaలో. పసిఫిక్ ద్వీప దేశాలైన Tonga, Samoa, Kiribati అన్ని దేశాల కన్నా ముందుగా కొత్త ఏడాదికి స్వాగతం చెప్పనున్నాయి. ఆ తరవాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా 2022కి వీడ్కోలు చెబుతాయి. ఇక అందరి కన్నా ఆలస్యంగా వేడుకలు చేసునేది...Howland, Baker Islands.సిడ్నీ, సింగపూర్, లండన్, దుబాయ్‌లలోని కీలక ప్రాంతాల్లో బాణసంచా పేల్చి కొత్త ఏడాదికి స్వాగతం పలకనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తైపోయాయి. నెటిజన్లు ఇప్పటికే కొత్త ఏడాది స్వింగ్‌లో ఉన్నారు. సోషల్ మీడియాలో Bye Bye 2022 అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. కొత్త ఏడాది వేడుకలకు సిద్ధమవుతున్నారు.
కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సౌత్ కొరియా ప్రజలు. పర్యాటక ప్రదేశాల్లో జనం కిక్కిరిసిపోయారు. సెల్పీలు దిగుతూ న్యూ ఇయర్‌కి స్వాగతం చెప్పేందుకు రెడీ అవుతున్నారు.
(Image Credits: Reuters)
న్యూజిలాండ్‌లో కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పారు ప్రజలు. Sky Tower 10 సెకన్ల కౌంట్‌డౌన్ పెట్టి న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పటం ఏటా జరిగేదే. ఈ సారి కూడా అదే తరహాలో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ చేరుకుని కేరింతలు కొడుతూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -