2021లో కరోనా డెల్టా వేరియంట్ సృష్టించిన విలయ తాండవాన్ని చవిచూసిన యావత్‌ ప్రపంచం.. ఒమిక్రాన్ భయాల మధ్యే 2022కు ఘనంగా స్వాగతం పలుకుతోంది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే.. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరగనున్నాయి. తొలుత న్యూజిలాండ్​ను.. కొత్త సంవత్సరాది పలకరించింది.






2022 సంవత్సరానికి న్యూజిలాండ్​ ఘనంగా స్వాగతం పలికింది. మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీప కాంతుల వెలుగుల్లో ఆక్లాండ్‌ నగరం మెరిసిపోయింది. కేరింతలు కొడుతూ, బాణసంచా కాల్చి ఆక్లాండ్​ నగర వాసులు సంబరాలు జరుపుకున్నారు.‍ ప్రఖ్యాత స్కైటవర్​పై బాణాసంచా పేలుళ్లు ఆకర్షణగా నిలిచాయి.


ఆస్ట్రేలియా..


ఆస్ట్రేలియాలోనూ కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రపంచ ప్రఖ్యాత సిడ్నీహార్బర్​కు ఆస్ట్రేలియన్లు చేరుకుని.. నూతన ఏడాదికి ఆహ్వానం పలికారు. హార్బర్​ వంతెనపై రంగురంగుల బాణాసంచా వెలుగులు విశేషంగా ఆకట్టుకున్నాయి.






అనంతరం జపాన్, చైనా, రష్యా, భారత్‌ సహా పలు దేశాలు.. 2022లోకి అడుగుపెట్టనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు సిద్ధమయ్యారు.


భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి భయాందోళనలు కలిగిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాయి. రాత్రి 12 వరకు బహిరంగ ప్రదేశాల్లా న్యూ ఇయర్ వేడుకలు జరపకూడదని ఆదేశాలిచ్చాయి. ఆంక్షలు మీరితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు అధికారులు. ఒమిక్రాన్ కారణంగా దేశంలో మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందని పలు సర్వేలు వెల్లడించాయి.


Also Read: Omicron Death: దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం.. గజగజ వణుకుతోన్న జనం!


Also Read: Omicron Cases India: దేశంలో కొత్తగా 16,764 మందికి కరోనా.. 1200 దాటిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య


Also Read: Kannauj IT Raid: పుష్ప.. పుష్పరాజ్.. ఫ్లవర్ అనుకుంటివా? అత్తరు.. ఈ కథే వేరు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.