దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఇతర రాష్ట్రాల్లో ఆమ్‌ఆద్మీని విస్తరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే పంజాబ్‌లో ఆప్ ప్రతిపక్షంగా ఉంది. ఇక ఉత్తర్‌ప్రదేశ్, గోవా, ఉత్తరఖండ్.. ఇలా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. ముఖ్యంగా కీలక హామీలు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం మరో వాగ్దానం చేశారు.
గోవాలో ఆప్ అధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1000 అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం గోవాలోని నవేలింలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేజ్రివాల్ పాల్గొన్నారు.
ఇప్పటికే ఈ హామీని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోను ఇచ్చారు కేజ్రీ. పంజాబ్‌లో తాము అధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున అందజేస్తామని ఇటీవల కేజ్రీవాల్ ప్రకటించారు. గోవా అసెంబ్లీకి 2022 ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి.
Also Read: Rahul Gandhi on Nagaland Firing: 'కాల్పులు జరిగితే కేంద్ర హోంశాఖ ఏం చేస్తోంది?'
Also Read: Omicron Symptoms: లైట్‌గా జలుబు ఉందా? లైట్ తీసుకోవద్దు.. ఒమిక్రాన్‌కు అదే ప్రధాన లక్షణమట!
Also Read: Sabarimala Rush: ఒమిక్రాన్ భయాల వేళ పోటెత్తిన శబరిమల.. రికార్డ్ స్థాయిలో 42 వేల మందికి దర్శనం
Also Read: Omicron Cases in India: 'ఒమిక్రాన్‌కు వేగం ఎక్కువ.. కానీ లక్షణాలు స్వల్పమే'
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 2,796 మంది మృతి.. దిల్లీలో తొలి ఒమ్రికాన్ కేసు
Also Read: ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు