దేశంలో పౌరులు, భద్రతా సిబ్బంది సురక్షితంగా లేనప్పుడు హోంశాఖ ఏం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. నాగాలాండ్‌లో బలగాల కాల్పుల్లో పౌరులు చనిపోయిన ఘటనపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేంద్రం నిజమైన సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
ఏం జరిగింది?
మోన్ జిల్లాలోని ఓటింగ్ వద్ద మిలిటెంట్ల కదలికలున్నట్లు బలగాలకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. అయితే అప్పుడే బొగ్గు గనిలో విధులు ముగించుకుని కార్మికులు తిరు గ్రామం నుంచి ట్రక్కులో ఇంటికి వెళ్తుండగా బలగాలు కాల్పులు జరిపాయి. కాల్పుల్లో 13 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ జవాను సైతం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. స్థానికులు భద్రతా బలగాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలగాల వాహనాలను తగులబెట్టారు. బలగాల పొరపాటు వల్లే ఘటన జరిగిందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని అధికారులు జరిపారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వెల్లడించారు.
Also Read: Omicron Symptoms: లైట్‌గా జలుబు ఉందా? లైట్ తీసుకోవద్దు.. ఒమిక్రాన్‌కు అదే ప్రధాన లక్షణమట!
Also Read: Sabarimala Rush: ఒమిక్రాన్ భయాల వేళ పోటెత్తిన శబరిమల.. రికార్డ్ స్థాయిలో 42 వేల మందికి దర్శనం
Also Read: Omicron Cases in India: 'ఒమిక్రాన్‌కు వేగం ఎక్కువ.. కానీ లక్షణాలు స్వల్పమే'
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 2,796 మంది మృతి.. దిల్లీలో తొలి ఒమ్రికాన్ కేసు
Also Read: ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు