Global elite spent 10 crore on sex parties: దావోస్‌లో ప్రతి ఏడాది ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జరుగుతుంది. 130 దేశాల నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వస్తారు. వివిధ ప్రభుత్వాల ప్రతినిదులు వస్తారు. గంటల తరబడి భవిష్యత్ అవకాశాలు, పెట్టుబడులు, అభివృద్ధి జరిగే రంగాలపై చర్చలు జరుపుతారు. అయితే ఇదంతా ఓ సైడ్.. మరో వైపు ఈ పారిశ్రామికవేత్తలంతా శృంగార రసాస్వాదన కోసం కోట్లు ఖర్చు పెట్టారట.
అంతర్జాతీయ మీడియా డైలీ మెయిల్ దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా ఎస్కార్ట్ ఏజెన్సీలకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని ప్రకటించింది. పలువురు పారిశ్రామికవేత్తలు ఎస్కార్ట్‌ల, శృంగార పార్టీల కోసం పెద్ద మొత్తంలో వెచ్చించారు. స్విట్జర్లాండ్‌లో చట్టబద్దమైన వేశ్యా వృత్తి ఉంటుంది. వీరిని బుకింగ్ చేసుకునేందుకు ప్రత్యేకమైన ఏజెన్సీలు ఉంటాయి. ఆన్ లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇలాంటి సర్వీస్ అందించే కంపెనీలు కూడా ఉంటాయి. అవి రకరకాల సర్వీసులు అందిస్తాయి. శృంగార పార్టీలోతో పాటు ఆసక్తి ఉన్న వారికి ట్రాన్స్ జెండర్లను కూడా సరఫరా చేస్తారు.
పారిశ్రామికవేత్తలతో గడిపిన వారు ఎలాంటి వివరాలు బహిర్గతం చేయకూడదని ఒప్పందాలు రాసివ్వాల్సి ఉంటుంది. అయితే వారికి పెద్ద మొత్తంలో నగదు చెల్లిస్తారు. ఒక్క బుకింగ్ కు ఏకంగా ఆరున్నర లక్షలు కూడా చెల్లించేవారు ఉంటారని చెబుతున్నారు. ఈ ఈవెంట్‌లలో సగటు బుకింగ్ వ్యవధి సుమారు నాలుగు గంటలు మాత్రమే ఉంటుంది. ఈవెంట్ జరిగిన మొదటి మూడు రోజుల్లో కేవలం ఒక వెబ్‌సైట్ నుండి £270,000 అంటే ₹2.9 కోట్లు పెట్టి శృంగార సర్వీసులను బుక్ చేసుకున్నారు. వివిధ ప్రొవైడర్లలో మొత్తం బుకింగ్‌లలో సుమారు భారత రూపాయల్లో పది కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Also Read: ట్రంప్‌తో ఫోటో కోసం పది కోట్లు పైనే కట్టిన అంబానీ దంపతులు - కుబేరుడైనా టిక్కెట్ కొనాల్సిందే
శృంగార పార్టీలలో ఆర్గీస్ అనే పార్టీకి ప్రత్యేకత ఉంటుంది. ఒకేసారి అనేక మంది మహిళలను బుక్ చేసుకుని పార్టీ నిర్వహించుకుని విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి పార్టీలను బుక్ చేసే ఓ ఫ్లాట్ ఫామ్ యజమాని .. తమ యాప్ నుంచి మూడు రోజుల్లో 90 మంది కస్టమర్లు 300 ఎస్కార్ట్‌లను బుక్ చేసుకున్నారని డెయిలీ మెయిల్ కు వెల్లడించారు. ట్రాన్స్‌వుమెన్‌లను కూడా బుక్ చేసుకున్నారని తెలిపారు. గత ఏడాది కేవలం 170 మంది మాత్రమే బుక్ చేసుకున్నారని అంటే గణనీయంగా పెరిగాయని చెబుతున్నారు.
పారిశ్రామిక వేత్తలు తమ తమ వ్యాపారాల్లో ఎంత బిజీగా..సీరియస్ గా ఉంటారో.. రాత్రి అయ్యే సరికి అంత జల్సా పురుషులుగా మారుతారని అంటున్నారు. అయితే అందూర అలాగే ఉండకపోవచ్చని.. కొంత మంది మాత్రం అలా ఉండవచ్చని అంటున్నారు. మొత్తానికి దావోస్ శృంగార పార్టీల గురించి ప్రపంచం అంతా చర్చించుకుంటోంది.
Also Read: ఢిల్లీ ఎన్నికల్లో జోరుగా తెలుగు నేతల ప్రచారం - కూటమి అగ్రనేతలు కూడా క్యూ కడతారా ?