Ghulam Nabi Azad New Party:
ఇటీవలే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన సీనియర్ లీడర్ గులాం నబీ ఆజాద్...జమ్మూలోని సైనిక్ కాలనీలో భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే మరోసారి కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. పార్టీ బాగు కోసం రక్తం చిందించామని స్పష్టం చేశారు. పార్టీని నిలబెట్టింది కంప్యూటర్లో, ట్వీట్‌లో కాదని, తమ కష్టంపైనే ఎదిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమం వేదికగానే కొత్త పార్టీ గురించి మాట్లాడారు. పార్టీకి ఏ పేరు పెట్టాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అందరికీ అర్థమయ్యేలా హిందుస్థానీ పేరు పెట్టాలని భావిస్తున్నానని వెల్లడించారు. ప్రజలే పార్టీ పేరు, జెండాను నిర్ణయిస్తారని చెప్పారు. తన పార్టీ జమ్ము, కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలనే డిమాండ్‌ను వినిపించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
జమ్ముకశ్మీర్‌కు గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించి ఆజాద్..ఇప్పుడు ఆ ప్రాంతంలోనే పార్టీ పెట్టనున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారి తీశాయి. ఆజాద్ పార్టీ పెట్టిన తరవాత ఏం చేయనున్నారు..? ఆయన ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
1. గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సమయంలో ఆయన భాజపాలో చేరతారన్న ఊహాగానాలు వచ్చాయి. అయితే...దీనిపై ఆజాద్ స్పందించారు. అవి పుకార్లేనని స్పష్టం చేశారు. అంతే కాదు. కొత్త పార్టీ పెడతున్నట్టు అప్పుడే ప్రకటించారు. త్వరలోనే జమ్ము, కశ్మీర్‌లో ఎన్నికలు జరగనున్నందున...అక్కడే కొత్త పార్టీకి శ్రీకారం చుడతానని స్పష్టం చేశారు.
2. పార్టీ పెడతారు సరే. ఆ తరవాత ఆయన ఏం చేస్తారు..? అన్నదే ఆసక్తికరంగా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆజాద్...జమ్ముకశ్మీర్‌లోని భాజపా సహా ఇతర కీలక పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలతో పొత్తు పెట్టుకుంటారని అంచనా వేస్తున్నారు. కానీ...గతంలోనే ఆజాద్ ఈ విషయంలో ఓ స్పష్టతనిచ్చారు. భాజపాతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
3. కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ఎప్పటి నుంచో అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల ఆయన చేసిన పని, ఆయనలోని అసహనాన్ని తెలియజేసింది. జమ్ముకశ్మీర్‌లో పార్టీ క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్‌గా గులాం నబీ ఆజాద్‌ను నియమించింది అధిష్ఠానం. ఇలా నియమించిన కాసేపటికే ఆ పదవికి రాజీనామా చేశారాయన. అంతే కాదు. జమ్ముకశ్మీర్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నుంచి కూడా తప్పుకున్నారు.
4. ఆ తరవాత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఆ సమయంలో అధిష్ఠానంపై ఎంతో అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ వైఖరిపై విమర్శలు చేశారు. పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలోనూ చిన్న పిల్లాడిలా వ్యవహరించారని,
ఆయన వల్లే పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని కాస్త ఘాటుగానే లేఖ రాశారు. అనవసర భజన చేసే వాళ్లకే పార్టీలో ప్రాధాన్యత ఉంటోందని విమర్శించారు.
5. రెండేళ్ల కిందట పార్టీలోని 23 మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీలో ప్రక్షాళన అవసరం అని అందులో తేల్చి చెప్పారు. సోనియాకు లేఖ రాసిన వారిలో గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు. గత నెల జమ్ము కశ్మీర్ పార్టీ చీఫ్ పదవి నుంచి గులాం అహ్మద్ మీర్ నుంచి తప్పుకున్నారు. గులాం అహ్మద్, గులాం నబీ ఆజాద్ మంచి మిత్రులు. ఈ ఇద్దరు మిత్రులు వరుసగా కీలక పదవుల నుంచి తప్పుకోవటం అధిష్ఠానాన్ని కలవర పెడుతోంది.
Also Read: Chiranjeevi: రాజ్ భవన్‌కు మెగాస్టార్ చిరంజీవి, వారిని అభినందించిన గవర్నర్ తమిళిసై
Also Read: Jharkhand Trust Vote: విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్న ఝార్ఖండ్ సీఎం సోరెన్, అప్రమత్తమైన భాజపా