ABP  WhatsApp

Ghulam Nabi Azad: కొత్త పార్టీ ఏర్పాటుపై ఆజాద్ కీలక ప్రకటన!

ABP Desam Updated at: 11 Sep 2022 05:01 PM (IST)
Edited By: Murali Krishna

Ghulam Nabi Azad: కొత్త పార్టీ ఏర్పాటుపై గులాం నబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

(Image Source: PTI)

NEXT PREV

Ghulam Nabi Azad: కాంగ్రెస్ పార్టీ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. తన కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 10 రోజుల్లో కొత్త పార్టీని ప్రకటిస్తానని సస్పెన్స్‌కు తెరదించారు. ఆదివారం.. బారాముల్లాలో జరిగిన బహిరంగ సభలో ఈ విషయం స్పష్టం చేశారు.



కొత్త పార్టీపై పది రోజుల్లో ప్రకటన చేస్తాను. నేను కాంగ్రెస్‌ పార్టీని వీడిన తర్వాత నాకు మద్దతిచ్చే వారి సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. పార్టీలతో సంబంధం లేకుండా నాకు మద్దతు తెలుపుతున్నారు. నేను రాజీనామా చేసి కశ్మీర్‌కు వచ్చిన తర్వాత జమ్మూలో 30-35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 400 మందిని కలుసుకున్నాను. వారంతా నాకు మద్దతు తెలిపారు. నేను ఏ పార్టీలో ఉన్నా నా వెంట నడుస్తానని చెప్పారు.                                                        - గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ మాజీ నేత


పార్టీకి గుడ్‌బై


73 ఏళ్ల ఆజాద్ గత నెలలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన సూచనలు, సలహాలను ఏళ్ల తరబడి ఏఐసీసీ మూలనపెట్టేసిందని సోనియా గాంధీకి రాసిన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వ పటిమపై కూడా విమర్శలు చేశారు.


ఆజాద్‌ రాజీనామా చేసిన తర్వాత కశ్మీర్‌లో దాదాపు 1500 మంది కార్యకర్తలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. కశ్మీర్‌ ప్రజల కోసం తన పోరాటం కొనసాగిస్తానని ఆజాద్ అన్నారు.


బారాముల్లా నుంచి 


కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత సొంత బలాన్ని నిరూపించుకునేందుకు తన కంచుకోట లాంటి బారాముల్లాను ఆజాద్ ఎన్నుకున్నారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం, స్థానికులకు భూమి హక్కు, ఉపాధి హక్కు కోసం తాను కృషి చేస్తానని ఆజాద్ అన్నారు. బారాముల్లాలో ర్యాలీ తర్వాత కుప్వారా, సౌత్ కశ్మీర్‌లో ఆజాద్ వరుసగా ర్యాలీలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీపై ఆజాద్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.



కాంగ్రెస్‌ పార్టీ నాపై క్షిపణులు ప్రయోగించింది. అయితే వాటిని కేవలం రైఫిల్‌తో నాశనం చేశాను. ఒక వేళ నేను బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి ఉంటే వారు అదృశ్యమయ్యేవారు. పరోక్షంగా సోనియా, రాహుల్‌ గాంధీపై ఆజాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం జమ్ము కశ్మీర్‌లోని భదర్‌వాలో జరిగిన బహిరంగ సభలో గులాం నబీ ఆజాద్‌ ఇలా మాట్లాడారు.                           -  గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ మాజీ నేత


Also Read: Queen Elizabeth Funeral: రాణిని చివరిసారి చూసేందుకు కూడా మేఘన్‌కు నో పర్మిషన్!


Also Read: Bharat Jodo Yatra: 'ఎందుకీ బ్రహ్మచర్యం, పెళ్లి చేసుకోండి అమ్మాయిని చూస్తాం'- సిగ్గుపడిన రాహుల్!

Published at: 11 Sep 2022 04:49 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.