Heavy Rains: ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ జరగని ఓ విషయం జరిగింది. చరిత్రో తొలిసారిగా రాష్ట్రంలో ప్రవహించే 5 నదులు ఒకే సారి సముద్రంలో కలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సహా పరివాహక ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, పెన్నా, వంశధార, గోదావరి, నాగావళి నదులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ఈ నదులపై ఉన్న ప్రాజెక్టుల్లో జల కల ఉట్టిపడుతోంది. నిండికుండలా మారిన జలాశయాల నుండి ఎగువ నుండి వస్తున్న నీటిని గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా సముద్రంలోకి వదులుతున్నారు. ఇలా ఒకేసారి ఐదు నదులు సముద్రంలో కలవడం ఇదే తొలిసారి. అల్ప పీడనం ప్రభావంతో మరో రెండు నుంచి మూడు రోజులు ఏపీతో పాటు యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంత్రం తెలిపింది.


నిన్న సాయంత్రం ఆరు గంటలకు.. 
శనివారం సాయంత్రం 6 గంటకు ప్రకాశం బ్యారేజీ నుండి 4.22 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. ధవేశ్వరం బ్యారేజీ నుండి 3.33 లక్షల క్యూసెక్కుల జలాలను విడుదల చేశారు. నెల్లూరు బ్యారేజీ  నుండి 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 18 వేలకు పైగా క్యూసెక్కుల నీటిని గొట్టా బ్యారేజీ నుండి విడుదల చేస్తున్నారు. నారాయణపురం ఆనకట్ట నుండి  20 వేలకు పైగా క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. 


కృష్ణమ్మ పరుగులు.. 
ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. భీమా, హంద్రీ, వేదవతి, తుంగభద్ర ఉరకలు వేస్తున్నాయి. ఎగువ నుండి వరద ప్రవాహం పెరుగుదలతో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 10 వేలు, హంద్రీ నీవా ద్వారా వెయ్యి క్యూసెక్కులు, కల్వకుర్తి నుండి 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి, ఎడమ కాల్వల నుండి 12 వేల 700 క్యూసెక్కుల జలాలను వదులుతున్నారు. విద్యుత్  ఉత్పత్తి చేస్తూ 3 లక్షల 81 వేల క్యూసెక్కుల జలాలను విడిచి పెడుతున్నారు. 


పోటాపోటీగా ప్రవహిస్తున్న నదులు.. ఒడిశా, ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాకు వంశధార, నాగావళి పోటాపోటీగా ప్రవహస్తున్నాయి. గొట్టా బ్యారేజీలోకి వంశధార నుండి 20 వేల క్యూసెక్కులకు పైగా నీరు చేరుతోంది. ఆయకట్టుకు 1973 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వీటిని సముద్రంలోకి వదులుుతున్నారు. నాగావళి ప్రాజెక్టు నుండి నారాయణ పురం ఆనకట్టలోకి 20 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఆయకట్టుకు 600 క్యూసెక్కులను విడుదల చేస్తూ మరో 20 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో జోరుగా కురుస్తున్న వానలతో గోదావరిలోనూ జల కళ కనిపిస్తోంది. ధవళేశ్వర బ్యారేజీలోక 3 లక్షలకు పైగా నీటిని విడిచి పెడుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలతో గోదారమ్మ ఉరకలెత్తుతోంది. 


Also Read: Minister Botsa: రెండు నెలల్లో సీపీఎస్ కు ప్రత్యామ్నాయం సిద్ధం చేస్తాం - మంత్రి బొత్స 


Also Read: Krishnam Raju Demise: కృష్ణంరాజు మరణంపై రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి - స్పందించిన సీఎంలు, ఇతర లీడర్లు