ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు చనిపోవడంపై సినీ ప్రముఖులే కాక రాజకీయ నాయకులు కూడా సంతాపం తెలుపుతున్నారు. దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


‘‘ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో మాజీ కేంద్రమంత్రి శ్రీ కృష్ణంరాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు) మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, 'రెబల్ స్టార్' గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని సీఎం పేర్కొన్నారు. లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా, దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సీఎం అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు’’ అని తెలంగాణ సీఎంవో ట్వీట్ చేసింది.






 సినీ నటుడు కృష్ణంరాజు ఇక లేరన్న విషయంపై సీఎం వైఎస్ జగన్ కూడా స్పందించారు. ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.


మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా కృష్ణంరాజు మరణంపై స్పందించారు. ‘‘కేంద్ర మాజీ మంత్రి, నటులు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు గారు పరమపదించడం అత్యంత విచారకరం. మంచితనానికి మారుపేరుగా అనేకమంది అభిమానాన్ని చూరగొన్న వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను.’’ అని ట్వీట్ చేశారు. 






మంత్రి కేటీఆర్ స్పందిస్తూ తెలుగు సినిమాల్లోని ప్రముఖ నటుల్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒకరని అన్నారు. ఆయన మరణం గురించి తెలిసి విచారం కలిగిందని ట్వీట్ చేశారు. ప్రభాస్ కు ఆయన ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


‘‘ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఇక లేరన్న వార్త దిగ్భ్రాతి కలిగించింది. ఆయన మరణం సినీ లోకానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.’’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.


నటుడు కృష్ణంరాజు ఇక లేరన్న వార్త దిగ్భ్రాతి కలిగించిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ‘‘ఆయన మరణం సినీ లోకానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’’ అని ట్వీట్ చేశారు.






‘‘ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఇక లేరన్న వార్త దిగ్భ్రాతి కలిగించింది. ఆయన మరణం సినీ లోకానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.’’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.