జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్‌డ్ (JEE advanced) ఫలితాలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే ఉదయం 10 గంటలకు విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ రోల్ నంబర్ మరియు/లేదా వ్యక్తిగత వివరాలను నమోదు చేసి JEE అడ్వాన్స్‌డ్ ఫలితాలను చూసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలతో పాటు ఆల్ ఇండియా టాపర్స్, ఇతర వివరాలను కూడా విడుదల చేసింది. ఫలితాలతోపాటు తుది ఆన్సర్ కీని కూడా విడుదల చేశారు.  ఆన్సర్ కీని అందుబాటులో ఉంచారు. కటాఫ్ మార్కులను జనరల్ 88.41, ఈడబ్ల్యూఎస్ - 63.11, ఓబీసీ- 67, ఎస్సీ-43.08, ఎస్టీ-26.70 గా నిర్ణయించారు.




JEE Advanced 2022 Result     |   JEE Advanced 2022 Final Answer Key


Website


టాప్-10 ర్యాంక్లు వీరే...




ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఆగస్టు 28న దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు జేఈఈ మెయిన్‌‌లో అర్హత సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 1.56 లక్షల మంది హాజరయ్యారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 30 వేల మంది విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రంలో 30 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఐఐటీ బాంబే జేఈఈ అడ్వాన్స్ డ్–2022 నిర్వహించింది.



జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) లో ప్రవేశానికి (JoSAA) కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులు. జేఈఈ అడ్వాన్స్‌డ్ మార్కుల ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకులను నిర్ణయించనున్నారు. సెప్టెంబర్‌ 12 నుంచి ప్రవేశాలకు సంబంధించిన జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనిద్వారా దేశంలోని 23 ఐఐటీల్లో బీటెక్ సీట్లు కేటాయించనున్నారు.

రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి.. 

1) అధికారిక వెబ్‌సైట్ – jeeadv.ac.in కి లాగిన్ అవ్వాలి. 

2) రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేయండి.

3) JEE అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి క్లిక్ ఇవ్వాలి.

4) ఆ తర్వాత రిజల్ట్ కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.


12 నుంచి కౌన్సెలింగ్..


దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) షెడ్యూలును ఐఐటీ బాంబే ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 12 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. అయితే సెప్టెంబరు 20 వరకు అభ్యర్థులకు మాక్‌ కౌన్సెలింగ్‌ అందుబాటులో ఉంటుంది. దానివల్ల తమ ర్యాంకు ఆధారంగా ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. సెప్టెంబరు 21 నుంచి అసలు ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించింది. మొత్తం 6 రౌండ్ల కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐఐటీ బాంబే విడుదల చేసింది.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 6 రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్లు ఖాళీగా ఉంటే అక్టోబరు 16 నుంచి 21 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. మరోవైపు సీట్ల భర్తీ నియమ నిబంధనలను కూడా ప్రకటించింది. సీట్లు పొందిన జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.40,000; ఇతరులు రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి మొత్తం 114 విద్యాసంస్థలు కౌన్సెలింగ్‌లో పాల్గొననున్నాయి. అందులో 23 ఐఐటీలు, 31 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ఐటీలు, మరో 33 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.



Also Read: JoSAA 2022 Schedule: 'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!



JoSAA కౌన్సెలింగ్ ఇలా..


♦ 1వ రౌండ్‌ : సెప్టెంబరు 23 నుంచి 27 వరకు
♦ 2వ రౌండ్‌: సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు
♦ 3వ రౌండ్‌: అక్టోబరు 3 నుంచి 7 వరకు
♦ 4వ రౌండ్‌: అక్టోబరు 8 నుంచి 11 వరకు
♦ 5వ రౌండ్‌: అక్టోబరు 12 నుంచి 15 వరకు
♦ 6వ రౌండ్‌ (చివరి): అక్టోబరు 16 నుంచి 17 వరకు నిర్వహిస్తారు. 

6 రౌండ్ల సీట్ల కేటాయింపు తేదీలు ఇవే:
♦ 1వ రౌండ్‌ సీట్ల కేటాయింపు: సెప్టెంబరు 23న
♦ 2వ రౌండ్‌: సెప్టెంబరు 28వ తేదీ
♦ 3వ రౌండ్‌: అక్టోబరు 3
♦ 4వ రౌండ్‌: 8వ తేదీ
♦ 5వ రౌండ్‌: 12వ తేదీ
♦ 6వ రౌండ్‌ (చివరి): అక్టోబరు 16న


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..