Covid Vaccines: కరోనా వైరస్‌ను ఎదుర్కునేందుకు ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేసిన టీకాల (Covid 19 Vaccine) వల్ల వైద్య సంక్షోభం తలెత్తిందని వైద్య బృందం ఆరోపిస్తోంది. ఈ వ్యాక్సిన్ల దుష్ప్రభావాలతో బాధపడుతున్న వారికి చికిత్సలు అందిస్తున్న ఈ బృందం.. వ్యాక్సినేషన్ ప్రభావంపై మెడికల్ క్రైసెస్ డిక్లరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. శనివారం రోజు జూమ్ యాప్ ద్వారా పలు దేశాలకు చెందిన వైద్యుల బృందం ఈ అంశంపై మీడియా సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలోనే డాక్టర్ గాయత్రి పండిట్ రావు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా కరోనా టీకాలతో తలెత్తిన ప్రతికూల సమస్యలను గురించి వివరించారు. పూర్తి ఆరోగ్యంతో ఉన్న చాలా మంది కరోనా టీకాలు తీసుకున్న తర్వాత పలు రకాల ఆరోగ్య సమస్యల బారిన పడినట్లు తెలిపారు. 


వివరాలు సేకరించి, పరిశీలించాకే.. 
యూకేలోని యెల్లోకార్డ్ సిస్టం, ఆస్ట్రేలియన్ అడ్వర్స్ ఈవెంట్ మానిటరింగ్ సిస్టం, యూరప్ లోని యుడ్రా విజిలెన్స్ సిస్టంలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ వీజీ యాక్సిస్ డేటాబేస్ ద్వారా గణాంకాలను సేకరించి, పరిశీలించాకే ఈ విషయం చెబుతున్నట్లు వివరించారు. అయితే ఆ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 11 మిలియన్లు అంటే కోటీ పదిల లక్షల మంది కరోనా వ్యాక్సిన్ల వల్ల అనారోగ్య సమస్యలకు గురైనట్లు తెలుస్తోంది. ఇందులో సుమారు 70 వేల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పలు రకాల కారణాలతో చనిపోయినట్లు సమాచారం. నిజానికి క్షేత్రస్థాయిలో బాధతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని డాక్టర్ గాయత్రి పండిట్ రావు తెలిపారు. 


వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపి వేయాలి.. 
తక్షణమే కరోనా వ్యాక్సినేషన్లను నిలిపి వేయాలని ఈ వైద్య బృందం చెబుతోంది. కరోనా టీకాలు తీసుకొని దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కుంటున్న వారిలో దుష్ప్రభావాలను గుర్తించే చర్యలు చేపట్టాలని కోరుతోంది. అంతే కాదండోయ్ కరోనా వ్యాక్సినేషన్ తో అంతర్జాతీయ వైద్య సంక్షోభం తలెత్తుతుందన్న వాదనకు ప్రపంచ వ్యాప్తంగా 34 దేశాల వైద్యులు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పింది. తొందరగా విరుగుడు కనిపెట్టాలన్న ఆత్రంతో హడావుడి చేసి మరీ కరోనా వ్యాక్సిన్లను తయారు చేశారని,  అతి తక్కువ కాలంలోనే క్లినికల్ ట్రయల్స్ జరిపి నేరుగా ప్రజలకు టీకాలు అందించారని వివరించారు. కానీ వీటి వల్ల వచ్చే దీర్ఘకాలిక సమస్యలు గురించి మాత్రం పట్టించుకోలేరని ఆరోపించారు. 


ముందు బాగానే ఉండి ఆ తర్వాత సమస్యలతో.. 
టీకాలు తీసుకున్న వారు కొంతకాలం బాగానే ఉండి ఆ తర్వాత అనేక రకాల ఆరోగ్య సమస్యలకు గురవుతున్నట్లు వైద్య బృందం చెబుతోంది. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని, ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తోంది. అన్ని కరోనా వ్యాక్సిన్లపై లోతుగా పరిశీలన జరిపి.. మాలిక్యులర్, సెల్యులార్, బయోలాజికల్ ప్రభావాలను తేల్చాలని కోరింది. మరి ఈ అంశాలపై ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. 


Also Read: Long Covid: లాంగ్ కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి