Just In





Corona Cases: దేశంలో కొత్తగా 5 వేల కరోనా కేసులు- ఏడుగురు మృతి
Corona Cases: దేశంలో కొత్తగా 5,076 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏడుగురు కరోనాతో మృతి చెందారు.

Corona Cases: దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. కొత్తగా 5,076 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏడుగురు కరోనాతో మృతి చెందారు. తాజాగా 7,227 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.11 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- యాక్టివ్ కేసులు: 47945
- మొత్తం రికవరీలు: 43919264
- మొత్తం మరణాలు: 528150
- మొత్తం వ్యాక్సినేషన్: 2,14,95,36,744
వ్యాక్సినేషన్
దేశంలో కొత్తగా 17,81,723 కోట్ల మందికి కొవిడ్ టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 214.95 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,20,784 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
గ్రీన్ సిగ్నల్
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు కొవిడ్ టీకా (బీబీవి154/నాసల్ వ్యాక్సిన్) అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మంగళవారం తెలిపారు.
ఒక్కసారి చాలు
భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ నాసల్ స్ప్రే వ్యాక్సిన్‌ను ఒక్కసారి తీసుకుంటే చాలని నిపుణులు అంటున్నారు. ఈ నాసల్ స్ప్రే వ్యాక్సిన్‌ను 'BBV154'గా పేర్కొంటున్నారు. ప్రస్తుతం సిరంజీ ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ కంటే మెరుగ్గా ఈ నాసల్ స్ప్రే పనిచేస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఈ వ్యాక్సిన్ తయారీ కోసం ఇప్పటికే సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది.
Also Read: Uttar Pradesh: ఇదేం భక్తిరా నాయనా- నాలుక కోసుకొని అమ్మవారికి సమర్పణ!
Also Read: Krishnam Raju Death News: కృష్ణంరాజు మరణంపై కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి