Ganga Vilas Cruise:


ఆల్కహాల్‌ ఇస్తున్నారు: అఖిలేష్


గంగా విలాస్ క్రూజ్‌ను ఇటీవలే ప్రధాని మోడీ ప్రారంభించారు. అత్యంత విలాసవంతమైన ఈ క్రూజ్‌లో ఎన్నో సౌకర్యాలున్నాయి. అయితే...సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ క్రూజ్‌లో బార్ కూడా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 17 ఏళ్లుగా సర్వీస్‌లో ఉన్న క్రూజ్‌నే మళ్లీ ప్రారంభించిన బీజేపీ...ఈ ఘనత తమదేనని ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. పవిత్రమైన గంగానదిపై వెళ్లే ఈ క్రూజ్‌లో ఆల్కహాల్‌ను కూడా సర్వ్ చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ విషయంలో బీజేపీ నేతలే ముందుకొచ్చి
క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయబరేలీలో మీడియాతో మాట్లాడిన అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.


"ఎన్నో ఏళ్లుగా ఈ రివర్ క్రూజ్‌ నడుస్తోంది. ఇదేం కొత్త కాదు. 17 ఏళ్లుగా ఈ సర్వీస్‌లు నడుస్తున్నట్టు నాతో కొందరు చెప్పారు. అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి బీజేపీ తామే ఈ ఘనత సాధించినట్టు ప్రచారం చేసుకుంటోంది. ప్రచారం చేసుకోవడంలో, అబద్ధాలు ఆడడంలో ఆ పార్టీ ఎప్పుడూ ముందుగానే ఉంటుంది. ఈ క్రూజ్‌లో ఆల్కహాల్‌ కూడా సర్వ్ చేస్తున్నట్టు నాకు సమాచారం అందింది. ఎన్నికల స్టంట్‌లో భాగంగా పాత వాటిని మళ్లీ ప్రారంభిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు." 


- అఖిలేష్ యాదవ్, ఎస్‌పీ అధినేత 


టెంట్‌ సిటీ, గంగా విలాస్ అసలు లక్ష్యాలు వేరని అఖిలేష్ అన్నారు. క్రూజ్‌లో ఆల్కహాల్ సప్లై చేస్తున్నారా లేదా కచ్చితంగా చెప్పాలని డిమాండ్ చేశారు. 


"ఇప్పటి వరకూ గంగా నది వద్దకు వెళ్తే అక్కడి హారతి మంత్రాలు వినిపించేవి. అక్కడి పడవలు ఎక్కితే గంగా నదిలో ఏమేం చేయాలి..? ఏమేం చేయకూడదో గైడ్స్‌ వివరించే వాళ్లు. కానీ...క్రూజ్‌లో బార్ఉన్నట్టు తెలుస్తోంది. మేమైతే లోపలకు వెళ్లలేదు. అందుకే బీజేపీయే ఈ విషయాన్ని చెప్పాలి" 


- అఖిలేష్ యాదవ్, ఎస్‌పీ అధినేత 


ప్రత్యేకతలు...


MV గంగా విలాస్ వారణాసి నుంచి మొదలై మొత్తం 3,200 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. 51  రోజుల పాటు ఈ జర్నీ కొనసాగుతుంది. బంగ్లాదేశ్ మీదుగా అసోంలోని డిబ్రుగర్‌కు చేరుకుంటుంది. ఈ క్రమంలో మొత్తంగా రెండు దేశాల్లో కలిపి 27 నదుల్లో ప్రయాణం సాగుతుంది. 2018 నుంచే బీజేపీ ఈ క్రూజ్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతోంది. 2020లోనే రావాల్సి ఉన్నా...కరోనా కారణంగా జాప్యమైంది. ఈ క్రూజ్‌లో మొత్తం 3 డెక్స్‌,18 సూట్స్  ఉన్నాయి. 36 మంది ప్రయాణికులు అనుకూలంగా కూర్చోవచ్చు. విలాసవంతమైన సౌకర్యాలు అందు బాటులో ఉంటాయి. అంతకు ముందు అతి పొడవైన క్రూజ్‌ను స్విట్జర్‌ల్యాండ్‌లో తయారు చేశారు. అందులో 32 మంది కూర్చోవచ్చు. ఇప్పుడు ఆ రికార్డుని అధిగమిస్తూ...36 మంది ప్రయాణికులతో గంగా విలాస్‌ను రూపొందించారు. ప్రపంచంలోనే ది బెస్ట్ గా నిలవాలన్న ఉద్దేశంతో తయారు చేశారు. మొత్తం ప్రయాణంలో 50 టూరిస్ట్ ప్లేస్‌లను సందర్శించేలా ప్లాన్ చేశారు.


Also Read: Nepal Plane Crash: విమానాల్లో ఉండే బ్లాక్‌ బాక్స్‌లు ఎందుకంత కీలకం? ప్రమాదాల గుట్టు తేల్చేస్తాయా?