Gandhi Jayanti 2022: మహాత్మా గాంధీ, శాస్త్రిలకు రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల నివాళులు

ABP Desam Updated at: 02 Oct 2022 01:14 PM (IST)
Edited By: Murali Krishna

Gandhi Jayanti 2022: మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్ శాస్త్రిలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు నివాళులర్పించారు.

(Image Source: PTI)

NEXT PREV

Gandhi Jayanti 2022: మహాత్మా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రిలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ.. రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి పుష్పాంజలి ఘటించారు. 


ప్రముఖుల నివాళులు


గాంధీజీ 153వ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి 118వ జయంతి సందర్భంగా వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తదితరులు రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించారు.


లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్‌ ఘాట్‌లో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి  సోనియా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పుష్పాంజలి ఘటించారు. 


మోదీ ట్వీట్


గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.







ఈ గాంధీ జయంతి మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే భారతదేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటోంది. మనం ఎప్పుడూ బాపు ఆశయాలను పాటిద్దాం. గాంధీజీకి నివాళిగా ఖాదీ, హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నేను మీ అందరినీ కోరుతున్నాను.- ప్రధాని నరేంద్ర మోదీ





దిల్లీలోని ప్రధాన మంత్రి సంగ్రహాలయంలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గ్యాలరీలోని కొన్ని అంశాలను పోస్ట్ చేశాను. శాస్త్రి గారు ప్రధాన మంత్రిగా సాధించిన విజయాలకు ఈ గ్యాలరీ సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ సంగ్రహాలయాన్ని అందరూ సందర్శించాలి.- ప్రధాని నరేంద్ర మోదీ


Also Read: Gandhi Jayanti 2022: మృత్యువు వచ్చినా వెనక్కి తగ్గేదేలే! ఆయన జగత్ ప్రేమికుడు!


Also Read: UNSC Vote on Ukraine: రష్యా రిఫరెండంపై భద్రతా మండలిలో ఓటింగ్- దూరంగా భారత్!

Published at: 02 Oct 2022 12:55 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.