ABP  WhatsApp

UNSC Vote on Ukraine: రష్యా రిఫరెండంపై భద్రతా మండలిలో ఓటింగ్- దూరంగా భారత్!

ABP Desam Updated at: 02 Oct 2022 11:59 AM (IST)
Edited By: Murali Krishna

UNSC Vote on Ukraine: రష్యా ఇటీవల చేపట్టిన రిఫరెండంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ భారత్‌ దూరంగా ఉంది.

(Image Source: Twitter/@sidhant)

NEXT PREV

UNSC Vote on Ukraine: ఉక్రెయిన్‌లోని 4 కీలక ప్రాంతాలను విలినం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా నిర్వహించిన రిఫరెండంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఓటింగ్‌ జరిగింది. ఈ ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది.


గంటల్లోనే


ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌, లుహాన్స్క్‌, జపోరిజియా, ఖేర్సన్‌.. ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తూ ఒప్పంద పత్రాలపై పుతిన్‌ సంతకాలు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఓటింగ్‌ జరిగింది. భారత్‌ ఈ ఓటింగ్‌లో పాల్గొనకుండా దూరంగా ఉంది. భారత్‌తో పాటు చైనా, బ్రెజిల్ దేశాలు కూడా ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి.






రష్యా మాత్రం వీటో చేసింది. రష్యా రిఫరెండాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా, ఆల్బేనియా దేశాలు భద్రతా మండలిలో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనిపై శుక్రవారం ఓటింగ్‌ నిర్వహించారు.


కుదరదు 


భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన రష్యా వీటో పవర్‌ను వినియోగించడంతో అమెరికా, ఆల్బేనియా తీర్మానం ఆమోదం పొంద లేదు. భద్రతా మండలిలో మొత్తం 15 సభ్యదేశాలు ఉండగా, 10 దేశాలు ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. భారత్, చైనా, గబాన్, బ్రెజిల్‌ మాత్రం ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఐరాసలో భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ మాట్లాడారు.



ఉక్రెయిన్‌ పరిణామాలు భారత్‌కు అందోళన కలిగిస్తున్నాయి. ప్రజల ప్రాణాలను బలిపెట్టి శాంతిని సాధించలేరు. హింసకు స్వస్తి పలికితేనే ఉక్రెయిన్‌–రష్యా సమస్యకు పరిష్కార మార్గం లభిస్తుంది.  -                                                            రుచిరా కాంబోజ్, ఐరాసలో భారత ప్రతినిధి


బైడెన్ వార్నింగ్


ఈ విలీనంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే...రష్యాపై పలు ఆంక్షలు విధించిన అమెరికా...ఈ చర్యతో వాటిని ఇంకా కఠినతరం చేసింది. NATO దేశాల భూభాగాన్ని ఆక్రమించాలని చూస్తే...రష్యాపై తీవ్ర ప్రతిఘటన తప్పదని బైడెన్ మరోసారి గట్టిగా హెచ్చరించారు. "నాటో దళాలు సిద్ధంగా ఉన్నాయి. నాటో టెరిటరీలోని ప్రతి ఇంచునీ కాపాడుకుంటాం" అని స్పష్టం చేశారు. "మిస్టర్ పుతిన్. నేను చెప్పేది మీకర్థమవుతుందో లేదో. ప్రతి ఇంచు అని చెబుతున్నా" అని చాలా స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చారు బైడెన్. ఇంత సీరియస్‌గా ఆయన స్పందించటానికి మరో కారణం కూడా ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తమ దేశాన్ని నాటోలో వీలైనంత త్వరగా కలిపేయాలని అప్లికేషన్ పెట్టుకున్నారు. ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనమైన నేపథ్యంలో జెలెన్‌స్కీ కాస్త తొందర పడుతున్నారు. అయితే...ఈ విషయమై బైడెన్...ఉక్రెయిన్‌కు ధైర్యం చెప్పారు. "పుతిన్ హెచ్చరికల్ని పట్టించుకోవద్దు" అని అంటున్నారు. "ఉక్రెయిన్ విషయంలో పుతిన్ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆయన చేసే పనులే చెబుతున్నాయి. అంత సులువుగా ఉక్రెయిన్‌ను ఆక్రమించలేరు. ఉక్రెయిన్‌కు మిలిటరీ ఎక్విప్‌మెంట్ అందించేందుకుఇప్పటికీ సిద్ధంగానే ఉన్నాం" అని బైడెన్ స్పష్టం చేశారు. 


Also Read: Gandhi Jayanti 2022: మహాత్ముని సిద్ధాంతాలు- ప్రపంచానికే మార్గదర్శకాలు!


Also Read: Arvind Kejriwal: మందులు కూడా కొనాల్సిన పని లేదు, మేమే అన్నీ ఉచితంగా ఇస్తాం - గుజరాత్‌లో కేజ్రీవాల్ హామీలు

Published at: 02 Oct 2022 11:39 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.