పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్నారు. ఈ మేరకు అమరీందర్ సింగ్ మీడియా సలహాదారు రవీన్ తుక్రాల్ తెలిపారు.
పంజాబ్ ప్రజలకు సేవ చేసేందుకు త్వరలోనే సొంత రాజకీయ పార్టీని ప్రారంభించనున్నాను. ఏడాదికిపైగా పోరాటం చేస్తోన్న రైతులకు అండగా ఉంటాం. పంజాబ్ భవిష్యత్తు కోసం పోరాటం మొదలైంది. - అమరీందర్ సింగ్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి
రైతుల సమస్యలు తీరిస్తే 2022 అసెంబ్లీ ఎన్నికల సమయానికి భాజపాతో కలిసి బరిలోకి దిగాలని ఆశిస్తున్నాం. అలానే మా భావజాలంతో కలిసే పార్టీలతో ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా అకాలీ వర్గంతో కలిసి వెళ్లాలనుకుంటున్నాం.- అమరీందర్ సింగ్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి
ఇటీవల సీఎం పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ అధిష్ఠానం తనతో వ్యవహరించిన తీరుపై విమర్శలు చేశారు.
Also Read: UP Assembly Election 2022: 'ఓ మహిళా మేలుకో.. అభివృద్ధిని కోరుకో.. 40 శాతం టికెట్లు మహిళలకే'
Also Read: ఈ ఊరిలో ప్రజలంతా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఇదో భిన్నమైన గ్రామం
Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!