బంగాల్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు.






పూర్వ మెదినీపుర్ జిల్లాలోని హల్దియా ప్రాంతంలో ఈరోజు మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్లో 37 మందిని కోల్​కతాలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రిఫైనరీలోని ఓ యూనిట్ మూసివేత పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ఐఓసీ ఓ ప్రకటనలో తెలిపింది. 


దీదీ దిగ్భ్రాంతి..






ప్రమాదంపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు పూర్తి వైద్య సాయం అందిస్తామని దీదీ హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు త్వరగా కోలుకావాలని ఆకాంక్షించారు.