Elon Musk On Trump: 'అధ్యక్షుడి కంటే రాజ్యాంగం గొప్పది'- డొనాల్డ్ ట్రంప్‌కు మస్క్ కౌంటర్

ABP Desam Updated at: 05 Dec 2022 04:45 PM (IST)
Edited By: Murali Krishna

Elon Musk On Trump: డొనాల్డ్ ట్రంప్‌నకు సంబంధించిన ఓ కథనంపై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు.

'అధ్యక్షుడి కంటే రాజ్యాంగం గొప్పది'- డొనాల్డ్ ట్రంప్‌కు మస్క్ కౌంటర్

NEXT PREV

Elon Musk On Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై వచ్చిన ఓ నివేదికకు ట్విట్టర్ అధినేత ఎలాన్ మాస్క్ స్పందించారు. "రాజ్యాంగం.. అధ్యక్షుడి కన్నా గొప్పది" అని మస్క్ ట్వీట్ చేశారు. అమెరికా రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రంప్ తాజాగా పోస్ట్‌లు పెట్టారు. 2020లో జరిగిన ఎన్నికలను "పెద్ద మోసం" అంటూ విమర్శించారు. దీనిపై స్పందిస్తూ మస్క్ ఇలా ఇన్నారు.


ట్విట్టర్ ఫైల్స్


ట్విట్టర్ అధినేత ఎలాన్ మాస్క్ తాను విడుదల చేస్తానన్నా'ట్విట్టర్ ఫైల్స్' లో మొదటి భాగాన్ని ఇటీవల విడుదల చేశారు. 2020 అధ్యక్ష ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగిన కొన్ని పరిణామాలను ఆయన ఇందులో విడుదల చేశారు. వీటిపై న్యూయార్క్‌ పోస్ట్‌ పత్రిక ఇటీవలే ఓ కథనం రాసింది. 2020లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ అంతా బైడెన్ ల్యాప్‌టాప్‌లో ఉందని పేర్కొంది. అంతర్గత ట్విట్టర్‌ ఈమెయిల్స్‌ కూడా విడుదల చేసింది. దీంతో ట్రంప్ ఇలా అన్నారు.



ఇలాంటి భారీ మోసాలు...అన్ని రూల్స్‌ని, నిబంధనలను, రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ని రద్దు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. మొత్తం రాజ్యాంగాన్నే రద్దు చేయాల్సిన పరిస్థితులు తీసుకొస్తున్నాయి.                      - డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు


ఈ మేరకు Truth Social అనే సోషల్ నెట్‌వర్క్‌లో ట్రంప్ ఈ పోస్ట్ చేశారు.


విమర్శలు


రాజ్యాంగంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను డెమొక్రాట్లు, వైట్ హౌస్ సహా కొంతమంది రిపబ్లికన్లు కూడా తప్పుబట్టారు.



అమెరికా రాజ్యాంగం చాలా పవిత్రమైనది. మన దేశంలో 200 ఏళ్లుగా స్వతంత్రం, చట్టపరమైన పాలన కొనసాగించేందుకు రాజ్యాంగం తోడ్పడింది. మన రాజ్యాంగం.. రాజకీయ పార్టీలకు అతీతంగా, గెలిచిన నాయకులకు అతీతంగా అమెరికా ప్రజలందరిని ఏకం చేస్తుంది.                                  - ఆండ్రూ బట్స్, వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ


అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయనున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ సభలు జరిగినా ఈ హింట్ ఇస్తూనే ఉన్నారు ట్రంప్. ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. ఈ సారి ఎన్నికల్లో జో బైడెన్‌తో పోటీ పడనున్నారు. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం వరుసగా ఇది మూడోసారి. తన పోటీ గురించి అధికారిక ప్రకటన చేసిన ట్రంప్...తన ప్రచారంలో మార్పులు చేయనున్నట్టు చెప్పారు. గతంలో కన్నా ఈ సారి కాస్త విభిన్నంగా క్యాంపెయినింగ్ చేయాలని భావిస్తున్నట్టు వివరించారు. "అమెరికాను ప్రపంచంలోనే గొప్ప దేశంగా నిలబెట్టాలి. అగ్రరాజ్యంగా మళ్లీ వెలిగిపోవాలి" అని అన్నారు. ఇటీవల మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమికి కారణం...ట్రంపేనని అంతా విమర్శించారు. కానీ...అవేవీ పట్టించుకోకుండా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలని సిద్ధపడుతున్నారు ట్రంప్.


Also Read: Watch Video: స్టేజ్‌పై రాహుల్ గాంధీ స్టెప్పులు- అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్‌ కూడా!

Published at: 05 Dec 2022 04:40 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.