Telangana News Today | దువ్వాడ కో న్యాయం మిగిలిన వాళ్ళకో న్యాయమా? రిగిలిపోతున్న కేడర్!
వైఎస్‌ఆర్‌సీపీకి కొత్త సమస్య వచ్చి పడింది. ముందు విజయసాయిరెడ్డి, తర్వాత దువ్వాడ, ఇప్పుడు అనంతబాబు. ఇలా రోజుకొకరిపై  ఆరోపణలు రావడంతో ఆ పార్టీకి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే టాక్ ఆఫ్‌ది తెలుగు స్టేట్స్‌ అయిన దువ్వాడపై మాత్రం చర్యలు తీసుకున్నారు. టెక్కలి ఇంచార్జీగా తొలగించారు. దీనిపై దువ్వాడ అనుచరులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దువ్వాడ కో న్యాయం మిగిలిన వాళ్ళకో న్యాయమా జగన్? ప్రస్తుతం ఉత్తరాంధ్ర వైసీపీలో ఇదే మెయిన్ టాపిక్‌గా మారింది. ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారాలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఇండియా కూటమి దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఇండియా కూటమి దృష్ప్రచారాన్ని ప్రజల్లోకి కార్యకర్తలు తీసుకెళ్లాలని సూచించారు. మర్చిల్ని, మసీదుల్ని కూల్చేస్తారని, రిజర్వేషన్లు తీసివేస్తారని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, అందువల్లనే మొన్నటి ఎన్నికల్లో సీట్లు తగ్గాయన్నారు. బీజేపీకు భారత రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనే లేదని, అటువంటి ప్రసక్తే లేదన్నారు. రాజ్యాంగానికి కట్టుబడి పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీనే అన్నారు. మసీదులు, చర్చిలు, రిజర్వేషన్లు తీసేయాలని ఏనాడూ బీజేపీ ఆలోచించలేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఢిల్లీకి బీఆర్ఎస్ బలగం - మంగళవారం కవితకు బెయిల్ వస్తుందన్న నమ్మకంతోనే ?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ , హరీష్ రావుతోపాటు 20మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు.    లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ క‌విత బెయిల్ పిటిష‌న్ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఖచ్చితంగా బెయిల్ వస్తుందన్న నమ్మకంతో కేటీఆర్ ఉన్నారు. అందుకే జైలు నుంచి వచ్చే కవితకు స్వాగం చెప్పేందుకు అందరితో కలిసి వెళ్తున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కవిత మార్చి  పదిహేనో తేదీ నుంచి జైల్లో ఉన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా క్రమంగా దిగజారుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


రుణమాఫీ కాని రైతులకు గుడ్‌ న్యూస్- ఇంటి వద్దకు వచ్చి వివరాలు నమోదు
తెలంగాణలో రుణమాఫీపై ఇంకా చాలా మందికి అందలేదన్న విమర్శలు వినిపిస్తున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ కారణాలతో లోన్‌ మాఫీ కాని వాళ్లకు మరో ఛాన్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అంలాటి వారి వివరాలు సేకరించేందుకు అధికారులను రంగంలోకి దింపింది. ప్రయోగాత్మకంగా వివరాలు నమోదు చేసిన అధికారులు మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలోకి వచ్చి వివరాలు తెలుసుకోనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


హైడ్రా కూల్చివేతలతో సొంత ఎమ్మెల్యేల్లో అసంతృప్తి - రేవంత్ రాజకీయంగా ఎలా తట్టుకుంటారు ?
తెలంగాణలో రాజకీయం అంతా ఇప్పుడు హైడ్రా  కూల్చివేల చుట్టూ తిరుగుతోంది. హైడ్రాకు మద్దతుగా ప్రజలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ... చెరువుల్ని కబ్జాల నుంచికాపాడకపోతే తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించనట్లేనని.. సొంత వాళ్లు ఉన్నా సరే వదిలి పెట్టబోనని ప్రకటించేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకూ హైడ్రా కూల్చివేతలకు మద్దతుగా మాట్లాడుతున్న వారు చాలా  పరిమితంగానే  ఉన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి