విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప' (Kannappa Movie). దీనిని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో పలు భాషలకు చెందిన సూపర్ స్టార్లు నటిస్తున్నారు. అలాగే, ఓ క్యూట్ అండ్ లిటిల్ స్టార్ కూడా ఉన్నాడు. విష్ణు మంచు తనయుడు అవ్రామ్ మంచు సైతం నటిస్తున్నాడు. 


శ్రీకృష్ణ జన్మాష్టమికి అవ్రామ్ ఫస్ట్ లుక్ విడుదల
'కన్నప్ప' సినిమాలో విష్ణు మంచు టైటిల్ రోల్ చేస్తున్నారు. తిన్నడుగా, కన్నప్పగా ఆయన కనిపించనున్నారు. అయితే... యంగ్ తిన్నడు రోల్ విష్ణు తనయుడు అవ్రామ్ మంచు చేస్తున్నారు. ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆ చిన్నారి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 






'కన్నప్ప'తో తెరపైకి మంచు ఫ్యామిలీలో మూడు తరాలు
లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ ప్రయాణం మొదలు అయ్యింది. ఆ తర్వాత ఆయన వారసులు విష్ణు, మనోజ్, వారసురాలు లక్ష్మి వచ్చారు. ఇప్పుడు అవ్రామ్ తెరంగేట్రంతో మూడో తరం కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టినట్టు అయ్యింది.


'కన్నప్ప'లో మరో స్పెషాలిటీ ఏమిటంటే... ఈ సినిమాలో మంచు ఫ్యామిలీలో మూడు తరాలు నటిస్తున్నారు. విష్ణు, అవ్రామ్ మాత్రమే కాదు... మోహన్ బాబు సైతం ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.


Also Read: భయపడకు, నేనున్నాను... మహేష్ వాయిస్ ఓవర్‌తో 'ముఫాసా' తెలుగు ట్రైలర్ వచ్చేసిందోచ్!



డిసెంబర్ నెలలో 'కన్నప్ప' వరల్డ్ వైడ్ రిలీజ్
Kannappa Movie Release: కన్నప్ప సినిమాను డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ఆల్రెడీ విష్ణు మంచు వెల్లడించారు. డిసెంబర్ 6న 'పుష్ప 2' విడుదల కానుంది. క్రిస్మస్ కానుకగా 'గేమ్ ఛేంజర్' విడుదల కన్ఫర్మ్ అని నిర్మాత 'దిల్' రాజు ఒకటికి రెండుసార్లు చెప్పారు. ఆ సినిమా డిసెంబర్ 20న వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి, 'కన్నప్ప'ను విష్ణు ఎప్పుడు థియేటర్లలోకి తీసుకు వస్తారో చూడాలి.


Also Readమైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో మహేష్ - రాజమౌళి సినిమా... ఇది మామూలు ప్లాన్ కాదయ్యా!



'కన్నప్ప'లో రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, తెలుగు తెర చందమామ నయనతార, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు రూపొందిస్తున్నాయి. మోహన్ బాబు నిర్మాత. హిందీ మహాభారత సిరీస్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారుడు