సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్! ఈ నెల 20వ తేదీన ఆయన థియేటర్లలో సందడి చేయనున్నారు. అయితే... నేరుగా మహేష్ తెరపై కనిపించరు. కానీ, ఆయన గొంతు మాత్రం వినబడుతుంది. అదీ ఓ హాలీవుడ్ సినిమా 'ముఫాసా: ది లయన్ కింగ్'లో! పూర్తి వివరాల్లోకి వెళితే


మనం ఒక్కటిగా పోరాడాలి - మహేష్ డైలాగ్ విన్నారా?
'ది లయన్ కింగ్'... 2019లో విడుదలైన హాలీవుడ్ సినిమా గుర్తు ఉందిగా! దానికి సీక్వెల్ అండ్ ప్రీక్వెల్ ఈ 'ముఫాసా: ది లయన్ కింగ్'. ఆల్రెడీ విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులలో సినిమా మీద అంచనాలు పెంచింది. ఈ రోజు తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. దాని స్పెషాలిటీ ఏమిటంటే... సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం! 'ముఫాసా: ది లయన్ కింగ్'లో తెలుగు వెర్షన్ వరకు ముఫాసా పాత్రకు మహేష్ తన గొంతు అరువు ఇచ్చారు.


''అప్పుడప్పుడూ ఈ చల్లని గాలి నా ఇంటి నుంచి వచ్చిన జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే మాయం అవుతుంది'' - ఇదీ ట్రైలర్‌లో వినిపించిన మహేష్ మొదటి మాట. 


'నేనుండగా నీకు ఏం కాదు టాకా, భయపడకు' - ఈ మాటలో హీరోయిజం ఉంది. ఆ మాట మహేష్ బాబు చెప్పడం వల్ల మరింత ఎలివేట్ అయ్యింది. 'మనం ఒక్కటిగా పోరాడాలి' అని మహేష్ చెప్పిన మాట సైతం బావుంది. ''నువ్వు (ముఫాసా), టాకా కలిసి ఉన్న చోటే ఇల్లు అవుతుంది. ఇద్దరూ కలిసి వెళ్ళండి. జీవన చక్రంలో మీ స్థానాన్ని తెలుసుకోండి'' అని ఆడ సింహం పంపించిన తర్వాత ఏమైంది? ముఫాసా మీద ఎటాక్ చేసింది ఎవరు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. కామెడీ కింగ్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందంతో పాటు మరొక ప్రముఖ కమెడియన్ ఆలీ సైతం ఈ సినిమాలో పాత్రలకు డబ్బింగ్ చెప్పారు.


Also Read: మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో మహేష్ - రాజమౌళి సినిమా... ఇది మామూలు ప్లాన్ కాదయ్యా!






హిందీలో వాయిస్ ఇచ్చిన షారుఖ్, ఆయన తనయులు!
'ముఫాసా: ది లయన్ కింగ్'లోని ముఫాసా పాత్రకు తెలుగులో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వగా... హిందీలో ఆ పాత్రకు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వాయిస్ ఇచ్చారు. హిందీ వెర్షన్ స్పెషాలిటీ ఏమిటంటే... యంగ్ ముఫాసాకు షారుఖ్ చిన్న కొడుకు అబ్‌రామ్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, సింబా పాత్రకు పెద్ద కొడుకు ఆర్యన్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.


Also Readఓటీటీలోకి వచ్చేసిన 'ముంజ్యా'... వంద కోట్ల హారర్‌ కామెడీ కావాలా, అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా చూసేయండి



డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా త్రీడీలో విడుదల!
డిసెంబర్ 20న 'ముఫాసా: ది లయన్ కింగ్' ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. అదీ త్రీడీలో! ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.