హరీష్ శంకర్ యాటిట్యూడ్ వల్ల 'మిస్టర్ బచ్చన్' ఫ్లాప్ అయ్యిందా? మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఆ సినిమా విడుదలకు ముందు, తర్వాత ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు - మీడియా ఇంటరాక్షన్ ఎక్కువ డ్యామేజ్ చేసిందా? అంటే... 'అవును' అన్నట్లు ప్రచారం జరిగింది. హరీష్ శంకర్ వల్ల సినిమాకు ఎక్కువ నష్టం జరిగిందని చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పినట్లు కథనాలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను ఆయన ఖండించారు.


నష్టాలు వస్తే రెమ్యూనరేషన్ ఇస్తానన్న హరీష్ శంకర్!
''హరీష్ శంకర్ ముందు మాకు స్నేహితుడు. ఆ తర్వాత ఆయనతో మేం సినిమా తీశాం. ప్రతి సినిమాతో కొంత నేర్చుకుంటాం. నేను తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని 'మిస్టర్ బచ్చన్' సినిమాతో ఏం నేర్చుకున్నది చెప్పాను. విజయం వస్తే చాలా పాజిటివ్ విషయాలు కనిపిపిస్తాయి. లిమిటెడ్ సక్సెస్ వచ్చినప్పుడు చాలా ఫీడ్ బ్యాక్ వస్తుంది. అది తీసుకోవాలి. నేను హరీష్ శంకర్ మీద కామెంట్ చేయలేదు. ఆయనతో మేం మళ్లీ సినిమా చేయడానికి రెడీ. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్లకు లాస్ వస్తే తన రెమ్యూనరేషన్ నుంచి డబ్బులు తిరిగి ఇవ్వడానికి రెడీ అయిన మంచి మనిషి హరీష్ శంకర్. మేం మళ్లీ భారీ సినిమాతో వస్తాం'' అని టీజీ విశ్వప్రసాద్ ట్వీట్ చేశారు.


Also Read: చిరంజీవి మంచి మనసుకు మరో సాక్ష్యం... సీనియర్‌ జర్నలిస్టు కష్టం తెలిసి గంటలో రెండు లక్షలు పంపి!






నిర్మాత చెప్పారని హరీష్ శంకర్ అసలు అనుకోలేదు!
టీజీ విశ్వప్రసాద్ చేసిన ట్వీట్ పట్ల దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. ఆ ట్వీట్ కోట్ చేస్తూ... ''సార్, మీరు ఎప్పుడూ ఇచ్చే మద్దతు నాకు తెలుసు. ఒక్క క్షణం కూడా ఆ కథనాల్లో రాసినది మీరు చెప్పారని అనుకోలేదు. మీతో కలిసి మళ్లీ మరో సినిమా చేయాలని, సెట్స్ కి కలిసి వెళ్లే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. థాంక్యూ సార్'' అని హరీష్ శంకర్ చెప్పారు.


Also Read: ఆహా ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ హారర్ మూవీస్ ఇవే... వీటిని అస్సలు మిస్ కావొద్దు






హిందీ హిట్ 'రెయిడ్' సినిమాను స్ఫూర్తిగా తీసుకుని, ఆ కథకు తనదైన మార్పులు - చేర్పులతో హరీష్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' తెరకెక్కించారు. అయితే, ప్రీమియర్ షోస్ నుంచి సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఫీడ్ బ్యాక్ తీసుకున్న హరీష్ శంకర్, సినిమాలో హిందీ పాటలను తొలగించారు. అయితే, బాక్సాఫీస్ బరిలో భారీ విజయం రాలేదు. రవితేజ 'ఈగల్' సైతం ఆశించిన విజయం సాధించలేదు. కానీ, ఆ సినిమా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనితో మరో సినిమా చేస్తున్నారు టీజీ విశ్వ ప్రసాద్. హరీష్ శంకర్ దర్శకత్వంలోనూ మరో సినిమా చేసే అవకాశం ఉంది.