ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు - సూపర్ స్టార్ మహేష్ బాబు 'పోకిరి' సినిమాలో డైలాగ్. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో ఆయన చేయబోయే సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చాక అందరూ అదే మాట అంటారని ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్. అసలు విషయం ఏమిటంటే...
హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీతో టై అప్!
'గుంటూరు కారం' సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి నుంచి మహేష్ ఖాళీగా ఉన్నారు. కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తారని అందరికీ తెలుసు. కానీ, ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. ఎందుకు? అంటే... మైండ్ బ్లాక్ అయ్యే కాంబినేషన్ కోసం దర్శక ధీరుడు ట్రై చేస్తున్నారట.
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ సినిమాను సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎల్. నారాయణ నిర్మించనున్నారు. ఆ సంగతి అందరికీ తెలుసు. అయితే... ఆయన నిర్మాణ సంస్థ ఒక్కటే కాదని, ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ కూడా భాగస్వామి కానుందని సమాచారం. రెండు మూడు హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలతో రాజమౌళి చర్చలు జరుపుతున్నారని, ఏదో ఒక ప్రొడక్షన్ కంపెనీతో డీల్ ఓకే అయ్యాక సినిమా అనౌన్స్ చేస్తారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు వరకు టాలీవుడ్ హీరోలు అందరూ పాన్ ఇండియా ఫిలిమ్స్ చేశారు. కానీ, మహేష్ పాన్ వరల్డ్ సినిమాతో, మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో భారీ గ్లోబ్ ట్రాంటింగ్ యాక్షన్ అడ్వెంచర్ చేయబోతున్నారు. ఒక్క సినిమాతో ఏకంగా ఆయన ప్రపంచ సినిమా కుంభస్థలాన్ని టార్గెట్ చేస్తున్నారు.
సినిమాలో హాలీవుడ్ నటీనటులు కూడా!
మహేష్ బాబు, రాజమౌళి సినిమా గురించి యూనిట్ సభ్యులు ఎవరు అఫీషియల్‌గా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ, ఈ సినిమాలో నటీనటులు ఎవరు ఎవరు అనేది కూడా చెప్పలేదు. కానీ, ఈ సినిమాలో క్రిస్ హేమ్స్‌వర్త్ విలన్ రోల్ చేసే అవకాశాలు ఉన్నాయని ఓ టాక్. మరో వైపు హీరోయిన్ పాత్రకు కూడా పలువురి హాలీవుడ్ నటీమణుల పేర్లు వినబడుతున్నాయి.
మహేష్ బాబు లుక్ చూస్తుంటే మాస్ మెంటల్!
సినిమా సినిమాకు మధ్య కాస్త గ్యాప్ తీసుకోవడం మహేష్ బాబుకు అలవాటు. ఆ విషయంలో అభిమానులు కాస్త ఫీల్ అవుతూ ఉంటారు. స్పీడుగా సినిమాలు చేస్తే బావుంటుందని ఆశ పడతారు. అయితే... ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం తమ అభిమాన కథానాయకుడు గ్యాప్ తీసుకుంటున్నా సరే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే... ఫారిన్ టూర్లకు వెళ్లి వచ్చే సమయంలో మహేష్ లుక్ బయటకు వస్తుంది. అది మాస్ మెంటల్ అంటున్నారు. లాంగ్ హెయిర్ మైంటైన్ చేస్తే మహేష్ చాలా బావుంటాడని చెబుతున్నారు. మరి, సినిమాలో ఆ లుక్ ఉంటుందా? లేదంటే రెండు మూడు లుక్స్ చూసుకుని వేరే ఒక్క లుక్ ఫిక్స్ అవుతారా? అనేది చూడాలి.