BJP MP Purandeswari | రాజమండ్రి పర్యటనలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మానవత్వాన్ని చాటుకున్నారు. లాలా చెరువు `రాజానగరం హైవేపై రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి వెళ్తుండగా జీఎస్‌ఎల్‌ ఆసుపత్రికి కూతవేటు దూరంలో రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలతో కనిపించింది. వెంటనే వెంటనే తన కాన్వాయ్‌ను ఆపివేసిన పురంధేశ్వరి క్షతగాత్రురాలి వద్దకు వెళ్లి ఆమె పరిస్థితిపై ఆరాతీశారు.. ఆమె వెంట ఉన్నవారితో మాట్లాడారు.. వెంటనే ఒక వాహనంలో సుమారు 100 మీటర్లు దూరంలో ఉన్న జీఎస్‌ఎల్‌ ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేయించారు.. అంతేకాకుండా వారికి ధైర్యం చెప్పి ఆసుపత్రి మేనేజ్‌మెంట్‌తో మాట్లాడి వారికి మెరుగైన చికిత్స అందివ్వాలని ఆదేశించారు. ప్రమాదంలో గాయాలపాలైన మహిళను ఆసుపత్రికి తరలించేవరకు అక్కడే ఉండి సహాయం చేసిన ఎంపీ పురంధేశ్వరికి క్షతగాత్రురాలు, ఆమె కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన పురంధేశ్వరి 
రాజమండ్రిలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంహించారు. రాజమండ్రి రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గన్న పురంధేశ్వరి ఆతరువాత పార్టీ కార్యలయంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ నేత సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు.


రాజ్యాంగం ప్రకారం ప్రతీ మూడేళ్లకోసారి సభ్యత్వ నమోదు చేయడం సర్వసాధారణమన్నారు. ఆరు సంవత్సరాలకోసారి బీజేపీ సంపూర్ణంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2014లో ఆన్‌లైన్‌లో సభ్యత్వ నమోదు పద్దతిని మొదటిసారిగా ప్రవేశపెట్టామని, ఇది ప్రజల వద్దకే వెళ్లి పార్టీ సిద్ధాంతాలు తెలియజేశామన్నారు. ఎలాంటి అవినీతి మరక లేకుండా ప్రజాహితంగా పనిచేస్తున్నామని, భారతదేశం యావత్తు ఈనాటికి సభ్యుల సంఖ్య 18 కోట్లుకు చేరిందన్నారు. 1980లో ఇద్దరు పార్లమెంటు సభ్యులతో మోదలైన బీజేపీ ప్రస్థానం ఈనాడు 240 మంది పార్లమెంటు సభ్యులను గెలుచుకునే స్థాయికి వెళ్లిందన్నారు. 


ఇండియా కూటమి దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి..  
ఇండియా కూటమి దృష్ప్రచారాన్ని ప్రజల్లోకి కార్యకర్తలు తీసుకెళ్లాలని సూచించారు. మర్చిల్ని, మసీదుల్ని కూల్చేస్తారని, రిజర్వేషన్లు తీసివేస్తారని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, అందువల్లనే మొన్నటి ఎన్నికల్లో సీట్లు తగ్గాయన్నారు. బీజేపీకు భారత రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనే లేదని, అటువంటి ప్రసక్తే లేదన్నారు. రాజ్యాంగానికి కట్టుబడి పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీనే అన్నారు. మసీదులు, చర్చిలు, రిజర్వేషన్లు తీసేయాలని ఏనాడూ బీజేపీ ఆలోచించలేదని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మిర్‌లో ‘ఇండియా’ కూటమిలో  భాగంగా కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ ఉమ్మడి మ్యానిఫెస్టో తీసుకొచ్చారని, మమ్మల్ని అధికారంలోకి తీసుకువస్తే 370 ఆర్టికల్‌ను మళ్లీ తీసుకొస్తామని వాళ్లు చెప్పారని, దేశాన్ని విభజించాలన్న ఆలోచనా ధోరణి వాళ్లదే అన్నారు. సీఏఏ, త్రిపుల్‌ తలాక్‌ రద్దు, వక్ప్‌బోర్డు అమైండ్‌మెంట్‌ వంటి అనేక నిర్ణయాలను బీజేపీ తీసుకుందని పురంధేశ్వరి తెలిపారు.  


Also Read: Andhra Pradesh: దువ్వాడ కో న్యాయం మిగిలిన వాళ్ళకో న్యాయమా? రిగిలిపోతున్న కేడర్!