APDME: ఏపీ వైద్య కళాశాలల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

AP DME Recruitment: ఏపీలోని వైద్యకళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఆగస్టు 23న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబరు 9 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Continues below advertisement

AP Medical Services Recruitment Board Assistant Professor Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), రాష్ట్రంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/ లేటరల్ ఎంట్రీ విధానంలో ఈ పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తుకు అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 23న ప్రారంభంకాగా.. సెప్టెంబర్‌ 9 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. విద్యార్హత మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

Continues below advertisement

వివరాలు..

* అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 488

1) అసిస్టెంట్ ప్రొఫెసర్- బ్రాడ్ స్పెషాలిటీస్ (క్లినికల్/ నాన్ క్లినికల్)
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ (ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం) ఉత్తీర్ణులై ఉండాలి. 

2) అసిస్టెంట్ ప్రొఫెసర్- సూపర్ స్పెషాలిటీస్ 
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ (డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. 

విభాగాలవారీగా ఖాళీలు: అనస్థీషియా-33, డెర్మటాలజీ-04, ఎమర్జెన్సీ మెడిసిన్-15, ఈఎన్‌టీ-08, జనరల్‌ మెడిసిన్‌-34, జనరల్ సర్జరీ-25, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్-09, న్యూక్లియర్ మెడిసిన్-06, ఓబీజీ-23, ఆర్థోపెడిక్స్-19, పీడియాట్రిక్స్-11, సైకియాట్రీ-03, రేడియాలజీ-32, రేడియోథెరపీ-02, టీబీ & సీడీ-02, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్-05, ఫోరెన్సిక్ మెడిసిన్-10, మైక్రోబయాలజీ-35, పాథాలజీ-18, ఫార్మాకాలజీ-24, ఎస్‌పీఎం-11, సీటీ సర్జరీ-11, కార్డియాలజీ-17, ఎండోక్రైనాలజీ-04, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ-06, మెడికల్ అంకాలజీ-16, నియోనటాలజీ-05, నెఫ్రాలజీ-18, న్యూరో సర్జరీ-14, న్యూరాలజీ-12, పీడియాట్రిక్ సర్జరీ-06, ప్లాస్టిక్ సర్జరీ-05, సర్జికల్ అంకాలజీ-10, యూరాలజీ-12, ఆప్తాల్మాలజీ-14, రేడియేషన్ ఆంకాలజీ-08, వ్యాస్కూలర్ సర్జరీ-01.

ALSO READ: ఏపీ వైద్యారోగ్యశాఖలో 997 సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ పోస్టులు

వయోపరిమితి: ఓసీలకు 42 సంవత్సరాలు. ఈడబ్ల్యూఎస్‌/ ఎస్సీ/ ఎస్టీ/ బీసీ అభ్యర్థులకు 47 ఏళ్లు మించకూడదు. దివ్యాంగులకు 52 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 50 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.1000. బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం: సెవెన్త్ యూజీసీ పేస్కేల్ ప్రకారం జీతభత్యాలు ఉంటాయి. దీనికి అదనంగా సూపర్ స్పెషాలిటీ అలవెన్స్ కింద రూ.30,000 చెల్లిస్తారు.

దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్లు..
➥  పాస్‌పోర్ట్ సైజు ఫొటో
➥  పదోతరగతి మార్కుల మెమో
➥  4 నుంచి 10వ తరగతుల వరకు స్టడీ సర్టిఫికేట్లు
➥  ఇంటర్ సర్టిఫికేట్
➥  ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్
➥  పీజీ డిగ్రీ సర్టిఫికేట్/సూపర్ స్పెషాలిటీ డిగ్రీ సర్టిఫికేట్
➥ పీజీ డిగ్రీ మార్కుల మెమో/సూపర్ స్పెషాలిటీ డిగ్రీ సర్టిఫికేట్
➥ సీనియర్ రెసిడెన్సీ కంప్లీషన్ సర్టిఫికేట్
➥ ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
➥ ఇతర అవసరమైన సర్టిఫికేట్లు

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.08.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 09.09.2024.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement
Sponsored Links by Taboola