China Zero Covid Policy: 


యాప్స్‌ ద్వారా సమాచారం 


చైనాలో జీరో కొవిడ్ పాలసీపై నిరసనలు మిన్నంటుతున్నాయి. ఉరుమ్‌కీ సిటీలో ఇప్పటికే ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఇవి క్రమంగా అన్ని నగరాలకూ విస్తృతమయ్యాయి. పలు యూనివర్సిటీల విద్యార్థులూ రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. ఈ నిరసనలు ఇక్కడితో ఆగడం లేదు. సోషల్ మీడియా ప్లాటఫామ్స్‌ని ప్రభుత్వం బ్యాన్ చేసినప్పటికీ...ఏదో లూప్‌హోల్ కనుగొని...అందులో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక పోస్ట్‌లు పెడుతున్నారు. చైనాలోని WeChat App ద్వారా ఆందోళనలు చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా సమాచారం అందించుకుంటూ..ఒక్కచోట గుమి గూడుతున్నారు. ప్రతి పోస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో నిరసనలు చేపట్టాల్సిన ఏరియాకు సంబంధించిన మ్యాప్‌ను యాడ్ చేస్తున్నారు. ఫలితంగా...అందరూ సులువుగా అక్కడికి చేరుకుంటున్నారు. అంతే కాదు. ప్రభుత్వ సెన్సార్ నుంచి తప్పించుకునేందుకు లొకేషన్‌కు సంబంధించిన కోడ్‌లను అందరికీ పంపుతున్నారు. ఆ కోడ్‌ ఏంటో కనుక్కుంటే...ఏ లొకేషన్‌లో నిరసనలు చేపట్టాలో అర్థమై పోతుంది. ఇదే విషయాన్ని అక్కడి ప్రజలు వివరిస్తున్నారు. "నాకో సీక్రెట్ క్లూ వచ్చింది. అది చూసి వెంటనే ఉరుమ్‌కీ మున్సిపల్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళ్లాను. అక్కడే  నిరననల్లో పాల్గొన్నాను" అని ఓ వ్యక్తి చెప్పాడు. ఇక చాలా మంది ప్రజలు VPNపై ఆధారపడుతున్నారు. VPN వినియోగించడం చైనాలో నిషేధం. అయినా...ఆ సాఫ్ట్‌వేర్ ద్వారానే ప్రజలు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నారు. టెలిగ్రామ్‌ ద్వారా కూడా సమాచారం అందించుకుంటున్నారు. ప్రభుత్వ ఆంక్షలు కాస్త తక్కువగా ఉండే డేటింగ్ యాప్స్‌నీ ఇందుకు వినియోగిస్తున్నారు. షాంఘై, చెంగ్డు ప్రాంతాల్లో నిరసనలు జరిగే ముందు టెలిగ్రామ్‌లో ఎక్కువ మంది ఈ లొకేషన్‌ కోడ్‌లను షేర్ చేసుకున్నట్టు తేలింది. చిన్న చిన్న టిప్స్‌ ఇచ్చి ఒక్క చోట చేరాక...ఆ డేటాని వెంటనే తొలగిస్తున్నారు. ఇది గమనించిన పోలీసులు..కొన్ని చోట్ల ఫోన్‌లు కూడా చెక్ చేస్తున్నారు. 


5 నగరాల్లో నిరసనలు..


షాంఘైలో ఈ ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఒకేసారి 300 మంది రోడ్లపైకి రావడం వల్ల పోలీసులు వాళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఘర్షణలు జరిగాయి. ఇటీవల ఉరుమ్‌కీలో ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. అయితే... అగ్నిమాపక సిబ్బంది సరైన సమయానికి వచ్చి ఉంటే వీళ్లంతా బతికుండే వాళ్లని స్థానికులు ఆరోపి స్తున్నారు. కేవలం కఠినమైన కరోనా ఆంక్షల కారణంగానే..వాళ్లు సమయానికి సంఘటనా  స్థలానికి చేరుకోలేకపోయారని మండి పడుతున్నారు. దీనిపైనే...షాంఘై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించేందుకు రోడ్లపైకి రాగా పోలీసులు వారిపై పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. మొత్తం 5 నగరాల్లో నిరనసలు తీవ్రమవుతున్నాయి. అయితే...ఈ వీడియోలను వెంటనే చైనా సోషల్ మీడియాలో నుంచి తొలగించారు. విమర్శలు రాకముందే...ప్రభుత్వమే ఈ వీడియోలను తొలగించి వేసింది. 


Also Read: Bilkis Bano: సుప్రీం తీర్పుని సవాల్ చేసిన బిల్కిస్ బానో, రిట్ పిటిషన్ దాఖలు