Covid-19 Cases in India:



798 కేసులు..


గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 798 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి యాక్టివ్ కేసుల సంఖ్య 4,091కి పెరిగింది. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కేరళలో ఇద్దరు, మహారాష్ట్రలో ఒకరు, పుదుచ్చేరిలో ఒకరు మృతి చెందారు. మొత్తంగా దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 5 లక్షల 33 వేలు దాటింది. ఇప్పటి వరకూ కొవిడ్ కొత్త వేరియంట్ కేసులు 157 వరకూ నమోదయ్యాయి. కేరళలో 78, గుజరాత్‌లో 34 నమోదైనట్టు ఇన్సకాగ్ ప్రకటించింది. ఢిల్లీలో ఇటీవలే తొలి JN.1 వేరియంట్ కేసు నమోదైంది. అయితే..ఈ బాధితుడు కోలుకున్నాడని, ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉన్నాడని వెల్లడించారు. ఇంకెవరికీ ఈ వేరియంట్ సోకలేదని స్పష్టం చేశారు. కొద్ది వారాలుగా పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. 9 రాష్ట్రాలు సహా కేంద్రపాలిత ప్రాంతాల్లో బాధితుల సంఖ్య పెరుగుతోంది. కేరళ, గుజరాత్ సహా 7 రాష్ట్రాల్లో JN.1 వేరియంట్‌ అలజడి సృష్టిస్తోంది. గోవాలో 18, కర్ణాటకలో 8, మహారాష్ట్రలో 7, రాజస్థాన్‌లో 5, తమిళనాడులో 4,తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి. ఈ డిసెంబర్‌లోనే దాదాపు 141 JN. వేరియంట్ కేసులు నమోదయ్యాయి. నవంబర్‌లో ఈ సంఖ్య 16కే పరిమితమైంది. 


ఢిల్లీ AIIMS అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి కొన్ని మార్గదర్శకాలు (AIIMS Guidelines) జారీ చేసింది. ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌కి వస్తున్న బాధితులను స్క్రీనింగ్ చేయాలని ఆదేశించింది. 


మార్గదర్శకాలివే..


1. ఎయిమ్స్‌లోని అన్ని డిపార్ట్‌మెంట్‌లలోని వార్డులలో కొవిడ్‌ బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. 


2. ఓ వార్డులో ప్రత్యేకంగా 12 పడకలు సిద్ధం చేయాలి. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి ఇక్కడే చికిత్స అందించాలి. 


3. ఓపీ డిపార్ట్‌మెంట్‌లో కొవిడ్‌ తరహా లక్షణాలతో బాధ పడుతున్న వాళ్లకి తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయాలి. 


4. వీలైనంత త్వరగా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ఫిల్టర్‌లు ఏర్పాటు చేయాలి. 


Also Read: Lok Sabha Election 2024: రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలి, I.N.D.I.A నేతలకు షాక్ ఇచ్చిన సిద్దరామయ్య