విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొడుతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘డెవిల్’ చిత్రం థియేటర్లలో విడుదలయ్యే మొదటి షో నుండే పాజిటివ్ టాక్ అందుకుంటోంది. సోషల్ మీడియాలో ‘డెవిల్’పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ మూవీ ఇప్పుడే థియేటర్లలో విడుదలయినా.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకుల్లో చర్చలు మొదలయ్యాయి. ‘డెవిల్’ మూవీ ఓటీటీ రైట్స్ గురించే కాదు.. శాటిలైట్ రైట్స్ గురించి కూడా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ.. ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకుందని సమాచారం.


ఓటీటీ రైట్స్ వారికే..
కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ‘డెవిల్’.. ఈ శుక్రవారం థియేటర్లలో సందడిని మొదలుపెట్టింది. మార్నింగ్ షో నుండే ఈ సినిమాకు పాజిటిక్ టాక్ లభిస్తోంది. దీంతో ఈ చిత్రం ఓటీటీలోకి రావడానికి చాలా సమయం పడుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్.. ‘డెవిల్’ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకున్నట్టు సమాచారం. ఇక శాటిలైట్ రైట్స్ విషయానికొస్తే.. ఈటీవీ ‘డెవిల్’ రైట్స్‌ను దక్కించుకుందని తెలుస్తోంది. ఈ మూవీ రైట్స్‌ను దక్కించుకోవడానికి అమెజాన్ ప్రైమ్, ఈటీవీ ఎంత ఖర్చు పెట్టాయనే వివరాలు ఇంకా బయటికి రాలేదు. కానీ సినిమా విడుదలకు ముందే విపరీతమైన హైప్ సంపాదించుకోవడంతో కచ్చితంగా ఈ రైట్స్ కోసం సంస్థలు భారీగానే ఖర్చుపెట్టుంటాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


లక్కీ లేడీ..
‘డెవిల్’ మూవీ టాక్ చూస్తుంటే కళ్యాణ్ రామ్‌కు సంయుక్త మీనన్ లక్కీ లేడీ అయిపోయినట్టు అనిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘బింబిసార’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఇప్పుడు ‘డెవిల్’ కూడా కొన్నిరోజుల పాటు ఇదే పాజిటివ్ రెస్పాన్స్‌ను కొనసాగించగలిగితే.. ఈ మూవీ కూడా ‘బింబిసార’ రేంజ్‌ను అందుకోగలుగుతుంది. అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ మూవీలో సంయుక్త మీనన్‌తో పాటు మరో కీలక పాత్ర పోషించిన మరో హీరోయిన్ మాళవికా నాయర్ కూడా అద్భుతంగా నటించిందని ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. వీరితో పాటు ప్రతీ యాక్టర్ పర్ఫార్మెన్స్ బాగుందని అంటున్నారు.


డైరెక్టర్ వర్సెస్ ప్రొడ్యూసర్..
ఎన్నో కాంట్రవర్సీల మధ్య ‘డెవిల్’ చిత్రం విడుదలయ్యింది. ముందుగా ఈ మూవీకి నవీన్ మేడారం దర్శకుడిగా ఎంపికయ్యాడు. కానీ కొన్నిరోజులకే మూవీ పోస్టర్లపై తన పేరు కాకుండా అభిషేక్ నామా పేరు కనిపించింది. అసలైతే అభిషేక్ నామా.. సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. కానీ దర్శకుడిగా కూడా అభిషేక్ పేరే కనిపించడంపై నవీన్ స్పందించాడు. తను ఎంతో కష్టపడి షూటింగ్ చేశానని, మూవీ మొత్తం తనే డైరెక్ట్ చేశానని, తన కష్టాన్ని బలవంతంగా లాగేసుకొని కనీసం దర్శకుడిగా తనకు క్రెడిట్స్ ఇవ్వలేదని నవీన్ వాపోయాడు. అయితే నవీన్ పనితీరు నచ్చలేదని, అందుకే తీసేశామని అభిషేక్ నామా తెలిపాడు. ఇన్ని కాంట్రవర్సీలు మధ్య విడుదలయిన ‘డెవిల్’.. ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది.


Also Read: డెవిల్ ఆడియన్స్ రివ్యూ: బొమ్మ మాసివ్ బ్లాక్ బస్టర్ - సోషల్ మీడియాలో టాక్ చూశారా?