Nandamuri Kalyan Ram's Devil movie twitter review in Telugu: నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'డెవిల్'. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్... అనేది ఉప శీర్షిక. అభిషేక్ నామా దర్శక నిర్మాత. దర్శకుడిగా ఆయన తొలి చిత్రమిది. 'బింబిసార' తర్వాత కళ్యాణ్ రామ్ జోడీగా హీరోయిన్ సంయుక్తా మీనన్ మరోసారి నటించిన చిత్రమిది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలైంది. ఆల్రెడీ విదేశాల్లో ప్రీమియర్ షోలు స్టార్ట్ అయ్యాయి. సోషల్ మీడియాలో సినిమా టాక్ ఎలా ఉంది? ఎన్నారై జనాలు ఏం అంటున్నారు?
బొమ్మ మాసివ్ బ్లాక్ బస్టర్!
Devil Movie Review Telugu: 'డెవిల్' చూశాక ''బొమ్మ మాసివ్ బ్లాక్ బస్టర్! థియేటర్లలో ఊచకోతనే'' అని ఓ నందమూరి అభిమాని ట్వీట్ చేశారు. కళ్యాణ్ రామ్ మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ చేశారన్నారు. ఇంటర్వెల్ భారీగా ఉందని పేర్కొన్నారు. నేపథ్య సంగీతం బావుందని, నందమూరి కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ బదులు మరొకరిని ఊహించుకోలేమని, కథ ఆసక్తికరంగా ముందుకు వెళ్లిందని చెప్పారు. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయని పేర్కొన్నారు.
Also Read: చిరంజీవికి కలిసి వచ్చిన విజయకాంత్ కథలు - ఇంకా కెప్టెన్ తమిళ సినిమాలను తెలుగులో రీమేక్ చేసింది ఎవరు?
పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్... 'డెవిల్'
'డెవిల్' పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని మరొక నెటిజన్ పేర్కొన్నారు. ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయని తెలిపారు. కళ్యాణ్ రామ్, నేపథ్య సంగీతం, ఇంటర్వెల్ & ప్రీ ఇంటర్వెల్ సూపర్ అన్నారు. అయితే... స్క్రీన్ ప్లేలో కొంచెం ల్యాగ్ ఉందని చెప్పారు.
వీఎఫ్ఎక్స్ ఇంకా బాగా చేయాల్సింది!
Devil Review Telugu: 'డెవిల్' సినిమా వీఎఫ్ఎక్స్ విషయంలో నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇంకా బాగా చేయాల్సి ఉందని ఓ నెటిజన్ పేర్కొన్నారు. మరి, మిగతా జనాలు ఏమంటారో చూడాలి. ఫస్టాఫ్ నేరేషన్ ఫ్లాట్ గా ఉందని మరొక మీమ్ పేజీలో పేర్కొన్నారు. సినిమాకు అంతటా పాజిటివ్ రివ్యూలు లేవు. కొంత నెగిటివ్ టాక్ కూడా ఉంది. సోషల్ మీడియాలో సినిమా గురించి వస్తున్న రివ్యూలపై ఓ లుక్ వేయండి.
నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన 'డెవిల్' సినిమాలో మణిమేఖల పాత్రలో రాజకీయ నాయకురాలిగా మరో హీరోయిన్ మాళవికా నాయర్ కనిపించనున్నారు. రోజీగా బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నరౌజి నటించారు. ఆమె ఓ ప్రత్యేక గీతం చేశారు. ఇంకా ఈ సినిమాలో మార్క్ఈ బెన్నింగ్టన్, అజయ్, 'స్వామి రారా సత్య', శ్రీకాంత్ అయ్యంగార్, షఫీ, లక్ష్మీ తదితరులు ఇతర తారాగణం. ఇంకా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : గాంధీ నడికుడియార్, కూర్పు : తమ్మిరాజు, కథా విస్తరణ : ప్రశాంత్ బారది, కాస్ట్యూమ్ డిజైనర్ : విజయ్ రత్తినమ్ ఎంపీఎస్‌ఈ, కథ - కథనం - సంభాషణలు : శ్రీకాంత్ విస్సా, ఛాయాగ్రహణం : సౌందర రాజన్, సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్, నిర్మాణ సంస్థ : అభిషేక్ పిక్చర్స్, సమర్పణ : దేవాంశ్ నామా, నిర్మాణం & దర్శకత్వం: అభిషేక్ నామా.