2023 మొత్తంలో డిసెంబర్‌లోనే సినిమాల సందడి ఎక్కువగా ఉంది. అంతే కాకుండా ఇప్పటివరకు డిసెంబర్‌లో విడుదలైన చాలావరకు సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. అందుకే డిసెంబర్ చివరి వారంలో కూడా మరికొన్ని చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అందులో మూడు తెలుగు చిత్రాలే కాగా.. ఒక కన్నడ చిత్రం కూడా ఉంది.
డెవిల్
కళ్యాణ్ రామ్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రమే ‘డెవిల్’. ఇదొక పీరియాడిక్ థ్రిల్లర్. స్వాతంత్ర్యం రాకముందు జరిగిన కథతో కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అభిషేక్ నామా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలయిన ‘డెవిల్’ టీజర్, ట్రైలర్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇక డిసెంబర్ 29న ‘డెవిల్’ థియేటర్లలో సందడి చేయనుంది.
బబుల్‌గమ్
ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై యాంకరింగ్‌లో మహారాణిగా వెలిగిపోతోంది సుమ. ఇప్పటికీ తనకు పోటీ ఇచ్చే లేడీ యాంకర్ లేదు. అలాంటి సుమకు వారసుడిగా రోషన్ కనకాల వెండితెరపై అడుగుపెట్టనున్నాడు. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ అయిన ‘బబుల్‌గమ్’తో మొదటిసారి హీరోగా ప్రేక్షకులను పలకరించనున్నాడు రోషన్. ఈ మూవీ కూడా ‘డెవిల్’తో పోటీపడుతూ డిసెంబర్ 29న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో వహిస్తున్న ‘బబుల్‌గమ్’తో మానసా చౌదరీ హీరోయిన్‌గా పరిచయం కానుంది.
కాటేరా
రెండు తెలుగు సినిమాలతో పాటు ఒక కన్నడ చిత్రం కూడా డిసెంబర్ 29న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. అదే ‘కాటేరా’. సీనియర్ హీరో దర్శన్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఆరాధన రామ్ హీరోయిన్‌గా నటించింది. తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించిన ‘కాటేరా’పై మూవీ టీమ్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. వీటితో పాటు రవితేజ ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘వెంకీ’ కూడా డిసెంబర్ 30న థియేటర్లలో రీ రిలీజ్ కానుంది.
ఓటీటీలో స్రీమ్ అయ్యే సినిమాలివే:
ఇక ఓటీటీ రిలీజ్‌ల విషయానికొస్తే.. అన్నింటికంటే ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్‌లోనే ఈవారం రిలీజ్‌లు ఎక్కువగా ఉన్నాయి.
- అనన్య పాండే, సిద్దాంత్ చతుర్వేది, ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఖో గయే హమ్ కహా’ సినిమా డిసెంబర్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యింది. అర్జున్ వరైన్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యూత్ నుంచి ఇప్పటికే పాజిటివ్ రివ్యూలు అందుతున్నాయి.
- డిసెంబర్ 29న నెట్‌ఫ్లిక్స్‌లో ఏకంగా రెండు సినిమాలతో పాటు ఒక వెబ్ సిరీస్ కూడా విడుదల కానుంది.
- నయనతార హీరోయిన్‌గా నటించిన 75వ చిత్రం ‘అన్నపూర్ణి’ ఓటీటీ రైట్స్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ దక్కించుకొని ఈ శుక్రవారం స్ట్రీమింగ్‌కు సిద్ధం చేసింది.
- ‘థ్రీ ఆఫ్ అజ్’ అనే హిందీ మూవీ కూడా శుక్రవారం స్ట్రీమింగ్ కానుంది.
- ‘మనీహీస్ట్’లో భాగమైన ‘బెర్లిన్’ వెబ్ సిరీస్ కూడా శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్ల ముందుకు రానుంది.
- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇప్పటికే ‘మంగళవారం’ స్ట్రీమింగ్ మొదలయ్యింది.
- డిసెంబర్ 29 నుంచి ‘12 ఫెయిల్’ చిత్రం కూడా హాట్‌స్టార్‌లోనే స్ట్రీమ్ అవ్వనుంది.
- తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కీడా కోల’ డిసెంబర్ 29 నుంచి ‘ఆహా’లో స్ట్రీమ్ కానుంది.
‘కీడా కోలా’ ట్రైలర్:
Also Read: బాలీవుడ్‌లో బడా ప్రాజెక్ట్ కొట్టేసిన ‘యానిమల్’ బ్యూటీ! యంగ్ హీరోతో జోడీ!