Mangalavaaram OTT: పాయల్ రాజ్‌పుత్, అజయ్ భూపతి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ ఓ రేంజ్‌లో హిట్‌ను అందుకుంది. ఆ తర్వాత వారి కాంబినేషన్‌లో తాజాగా విడుదలయిన ‘మంగళవారం’ కూడా అదే రేంజ్‌లో పాజిటివ్ టాక్‌ను అందుకుంది. నవంబర్ 17న థియేటర్లలో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా పరవాలేదనిపించాయి. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక ఈ మూవీ ఫైనల్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. డిస్నీ హాట్‌స్టార్‌లో ‘మంగళవారం’ స్ట్రీమ్ అవుతోంది.


‘మంగళవారం’తో మరో హిట్


‘RX100’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అయ్యాడు అజయ్ భూపతి. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్.. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. పాయల్ అందాలకు, గ్లామర్‌కు కుర్రకారు ఫిదా అయ్యారు. అప్పట్లో ఈ మూవీ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ తర్వాత అజయ్ ‘మహాసముద్రం’ అనే సినిమా తీశారు. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత తెరకెక్కించిన చిత్రం కావడంతో భారీ అంచనాల మధ్య ‘మహాసముద్రం’ విడుదలయ్యింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా మిగిలింది. అందుకే తన లక్కీ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌తోనే మరోసారి ‘మంగళవారం’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు అజయ్. థ్రిల్లర్, హారర్ లాంటి ఎలిమేంట్స్‌‌తో ఈ మూవీని అద్భుతంగా తీర్చిదిద్దాడు. అందుకే ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. థియేటర్లలో సూపర్ డూపర్ హిట్ అందుకుంది.


హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ మొదలు


‘మంగళవారం’ మూవీ ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకుంది. అన్ని భాషల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ‘మంగళవారం’ మూవీని స్ట్రీమింగ్‌కు చేస్తోంది. ఓటీటీ రిలీజ్‌పై సబ్‌స్క్రైబర్లకు ఆసక్తి కలిగించడం కోసం హాట్‌స్టార్ ప్రత్యేకంగా ఒక ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. ‘మంగళవారం’ థియేట్రికల్ ట్రైలర్‌కు, ఓటీటీ ట్రైలర్‌కు చాలా తేడా ఉంది. ఒక్క నిమిషంలోనే మరింత ఆసక్తికరంగా ట్రైలర్‌ను తీర్చిదిద్దింది హాట్‌స్టార్. ట్రైలర్‌తో పాటు డిసెంబర్ 26 నుండి ‘మంగళవారం’ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుందని కూడా వెల్లడించింది. చెప్పినట్టుగానే డిసెంబర్ 26న ‘మంగళవారం’ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ అయ్యింది.


ప్రియదర్శి పాత్ర హైలెట్


అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ‘మంగళవారం’ మూవీలో పాయల్ రాజ్‌‌పుత్‌తో పాటు అజ్మల్ అమీర్, నందితా శ్వేతా, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, దివ్య పిల్లై, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో ప్రియదర్శి క్యారెక్టర్ పెద్ద సర్‌ప్రైజ్‌గా నిలిచింది. ఎప్పుడూ కామెడీ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను నవ్వించే ప్రియదర్శి.. మొదటిసారి ‘మంగళవారం’తో భయపెట్టాడు. ముద్ర మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్‌పై స్వాతి రెడ్డి గుణపాటి, సురేష్ వర్మ, అజయ్ భూపతి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. అజ్నీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని అజ్నీష్ సంగీతం మరో లెవల్ కు తీసుకెళ్లిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. థియేటర్లలో ‘మంగళవారం’ మిస్ అయినవారు ఇకపై డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయవచ్చు.


Also Read: ‘యానిమల్’ ఓటీటీ వెర్షన్‌లో అదనంగా ఆ 9 నిమిషాల సీన్స్ - క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా