Upcoming Telugu Theatrical And OTT Movies: రీసెంట్ గా విడుదలైన ‘సలార్’, ‘డుంకీ’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి. భారీ అంచనాల నడుమ ఈ రెండు సినిమాలు విడుదలైనా, ‘సలార్’ ధాటికి ‘డుంకీ’ తట్టుకోలేకపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ మూవీ సత్తా చాటుతోంది. ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. ఇక ఈ ఏడాది చివరగా మరికొన్ని సినిమాలు సందడి చేయబోతున్నారు. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ అలరించబోతున్నాయి.


థియేటర్లలో సందడి చేసే సినిమాలు ఇవే!


1.‘డెవిల్‌’- డిసెంబరు 29న విడుదల


నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘డెవిల్’. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అభిషేక్‌ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో  కల్యాణ్‌ రామ్‌ సరసన సంయుక్త మీనన్‌, మాళవిక నాయర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో కల్యాణ్ రామ్ బ్రిటిష్‌ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్నారు.  ఆయన ఈ మూవీలో చేసే స్టైలిష్‌ యాక్షన్ సన్నివేశాలు ఆడియెన్స్ ను అలరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విజువల్ వండర్ గా రూపొందినట్లు సమాచారం.






2.‘బబుల్‌గమ్‌’- డిసెంబరు 29న విడుదల


రాజీవ్‌ కనకాల, సుమ దంపతుల కొడుకు రోషన్‌ కనకాల ‘బబుల్‌గమ్‌’ మూవీతో తెలుగు సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అవుతున్నారు. రవికాంత్‌ పేరెపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మహేశ్వరి మూవీస్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 29 ప్రేక్షకుల ముందుకు రానుంది.






ఓటీటీలో అలరించే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు


నెట్‌ఫ్లిక్స్‌


*స్నాగ్‌ (హాలీవుడ్‌)- డిసెంబరు 25న విడుదల


*ఖో గయే హమ్‌ కహా (హిందీ)- డిసెంబరు 26న విడుదల


*లిటిల్‌ డిక్సీ (హాలీవుడ్)- డిసెంబరు 28న విడుదల


*అన్నపూరణి(తమిళ్)- డిసెంబరు 29న విడుదల


*బెర్లిన్‌ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 29న విడుదల


*శాస్త్రి (సినిమా) డిసెంబరు 29న విడుదల


*బీస్ట్‌ (సినిమా) డిసెంబరు 31న విడుదల


డిస్నీ+హాట్‌స్టార్‌


*మంగళవారం(తెలుగు)- డిసెంబరు 26న విడుదల


*12thఫెయిల్‌ (హిందీ)- డిసెంబరు 29న విడుదల


ఆహా


*కీడా కోలా (తెలుగు)- డిసెంబరు 28న విడుదల


అమెజాన్‌ ప్రైమ్‌


*ఇట్టూసీ బాత్‌ (హిందీ)- డిసెంబరు 24న విడుదల


జీ5


*డోనో (హిందీ)- డిసెంబరు 29న విడుదల


*సఫేద్‌ (హిందీ)- డిసెంబరు 29న విడుదల


*వన్స్‌ అప్‌ ఆన్‌ టూ టైమ్స్‌ (హిందీ)- డిసెంబరు 29న విడుదల


లయన్స్‌ గేట్‌ ప్లే


*ది కర్స్‌ (వెబ్‌సిరీస్‌)- డిసెంబరు 29న విడుదల


జియో సినిమా


*ఆస్టరాయిడ్‌ సిటీ (హాలీవుడ్‌)- డిసెంబరు 25న విడుదల


Read Also: 'సరిహద్దులు చెరిగిపోతున్నాయి.. ఇండియన్ ఫిల్మ్ రేంజ్ పెరుగుతోంది' ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్