క సినిమాను ఒకసారి థియేటర్లలో చూడడమే ఎక్కువ అని ఫీల్ అవుతున్న సమయంలో మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్లాలి అనిపించే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఇటీవల విడుదలయిన సినిమాల్లో అలాంటి క్రేజ్‌ను సంపాదించుకుంది ‘యానిమల్’. సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కలిసి క్రియేట్ చేసిన మ్యాజిక్‌కు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. 3 గంటల 21 నిమిషాల నిడివి ఉన్న చిత్రాన్ని థియేటర్లలో ఎవరు చూస్తారులే అని అనుకున్నవారే మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్లి మరీ.. ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ చేశారు. ఇప్పుడు ప్రేక్షకులు దృష్టి మొత్తం ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్‌పైనే ఉంది. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి పలు రూమర్స్ వైరల్ అవుతున్నాయి.


ఎన్నో సమస్యలు..


దేశవ్యాప్తంగా ‘యానిమల్’ సినిమా రూ.532.44 కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. రణబీర్ కపూర్‌తో పాటు రష్మిక, అనిల్ కపూర్, బాబీ డియోల్.. ఇందులో కీలక పాత్రలు పోషించారు. అయితే ముందుగా ఈ సినిమాను మూడున్నర గంటల నిడివితో విడుదల చేద్దామని అనుకున్నాడట సందీప్. కానీ పలువురి ఒత్తిడి వల్ల 9 నిమిషాలను బలవంతంగా కట్ చేయాల్సి వచ్చిందని తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బయటపెట్టాడు. అంతే కాకుండా ‘యానిమల్’ విడుదల దగ్గరపడుతున్న సమయంలో తను ఎదుర్కున్న సమస్యల గురించి కూడా ప్రేక్షకులకు వివరించాడు.


చాలా సమస్యలు ఉన్నాయని అనిపించింది..


‘‘సినిమాను నేను మొదటిసారి చూసినప్పుడు చాలా సమస్యలు కనిపించాయి. కంటెంట్ పరంగా, సౌండ్ పరంగా సమస్యలు ఉన్నాయని నాకు అనిపించింది. మేము అయిదు భాషల్లో విడుదల చేస్తున్నాం కాబట్టి ఏ భాషకు సౌండ్ చెకింగ్ చేస్తున్నానని అప్పుడప్పుడు నేనే కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. చివరి 20 రోజులు అయితే మరీ దారుణం. దాదాపు మూడు, నాలుగు రోజులు మేము మిక్సింగ్ రూమ్‌లోనే పడుకున్నాం. అలా జరగకుండా ఉండాల్సింది. మాకు మరొక వారం సమయం ఉంటే బాగుండేది. కానీ నెట్‌ఫ్లిక్స్ వర్షన్‌కు అన్ని సమస్యలను క్లియర్ చేస్తున్నాను. బ్లూరే టెక్నాలజీని కూడా ప్లాన్ చేస్తున్నాం’’ అంటూ ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా.


రణబీర్ కంట్రోల్ చేసేవాడు..


‘యానిమల్’ విషయంలో తను చాలా స్పష్టంగా ఉండేవాడినని చెప్పుకొచ్చాడు వంగా. అందుకే సమస్యలు ఎదురయినప్పుడు తను కంట్రోల్ కోల్పోయేవాడని, రణబీర్ వచ్చి తనను కంట్రోల్ చేయాల్సి వచ్చేదని అన్నాడు. ‘‘నేను ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వర్షన్‌ను ఎడిట్ చేస్తున్నాను. నేను 3 గంటల 30 నిమిషాల వర్షన్‌ను థియేటర్లలో విడుదల చేయాల్సింది. కానీ ఒత్తిడి వల్ల 8 నుండి 9 నిమిషాల వరకు కట్ చేశాను. ఆ ఫుటేజ్‌ను యానిమల్ నెట్‌ఫ్లిక్స్ వర్షన్‌కు ఉపయోగిస్తాను’’ అని సందీప్ రివీల్ చేశాడు. అయితే ఇప్పటికే సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇచ్చిన థియేటర్ వర్షన్‌ను మాత్రమే రిలీజ్ చేస్తామని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించే ఆలోచనలో ఉంది. ఇంతలో సందీప్ వచ్చి అదనంగా 9 నిమిషాలు యాడ్ చేస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. మరి ఫైనల్‌గా ‘యానిమల్’ ఓటీటీ వర్షన్ ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Also Read: ప్రభాస్ కండలు గ్రాఫిక్స్ కాదు - క్లారిటీ ఇచ్చిన చైల్డ్ ఆర్టిస్ట్ ఫర్జానా