Coal Pilferage Case: బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల మాజీ మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ అరెస్ట్ చేయగా తాజాగా మరో మంత్రి మొలోయ్ ఘటక్ నివాసాల్లో సీబీఐ దాడులు చేస్తోంది.
ఆ కేసులో
కోల్‌కతాలోని లేక్ గార్డెన్, అసన్‌సోల్‌లోని మంత్రి నివాసాల్లో అధికారులు తనిఖీలు చేశారు. బొగ్గు కుంభకోణం కేసులో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఇదే కేసులో మరో నాలుగు ప్రాంతాల్లో కూడా సోదాలు జరిపారు. ఈ కేసులో ఇదివరకే మొలోయ్ ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఈ కేసులో 41 మందిపై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
వరుస షాక్‌లు
ఉపాధ్యాయుల నియామక కుంభకోణం కేసులో బంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ ఇటీవల అరెస్టు చేసింది. పశువుల అక్రమ రవాణా కేసులో తృణమూల్ కాంగ్రెస్ నేత అనుబ్రతా మండల్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ఈడీ ఇటీవల ఎనిమిది గంటల పాటు ప్రశ్నించింది.
రీషఫుల్
మమతా బెనర్జీ తన మంత్రివర్గాన్ని ఇటీవల రీషఫుల్ చేశారు. ఈ సారి కేబినెట్‌లో తొమ్మిది మంది కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చారు. ఇందులో బాబుల్ సుప్రియో, స్నేహసిస్ చక్రవర్తి, పార్థ భౌమిక్, ఉదయన్ గుహా, ప్రదీప్ మజుందార్, తజ్ముల్ హుస్సేన్, సత్యజిత్ బర్మాన్ వంటి వారు ఉన్నారు.
బంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ ఇటీవలే అరెస్టు చేసింది. ఆయన సన్నిహితురాలు నటి అర్పిత ముఖర్జీ నివాసాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.50 కోట్ల నగదు, బంగారు ఆభరణాలను జప్తు చేశారు.
ఈ పరిణామాల అనంతరం పార్థ ఛటర్జీని మంత్రి పదవిని తొలగించారు దీదీ. అంతేకాకుండా పార్టీలోని అన్ని పదవుల నుంచి తప్పించారు.
Also Read: Supreme Court - CJI Lalit: జెట్ స్పీడ్‌లో సుప్రీం కోర్టు విచారణ- 4 రోజుల్లో 1800 కేసులు!
Also Read: Tejashwi Yadav: డ్యూటీలో నిద్రపోతూ డిప్యూటీ సీఎంకు దొరికిపోయాడు!