Tejashwi Yadav: బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్.. పట్నా మెడికల్ కాలేజ్‌లో రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. దీంతో అధికారులు అవాక్కయ్యారు.
డ్యూటీలో స్లీప్
తేజస్వీ.. ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలోకి వెళ్ళారు. అక్కడ సూపరింటెండెంట్ పడకను సిద్ధం చేసుకుంటుండటం గమనించారు. పరుపుపైన దోమ తెరను అమర్చుకుని నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో ఆయన ఆ గదిలోకి ప్రవేశించారు. ఇంతలో తేజస్వీ యాదవ్‌ను చూసి ఆయన షాకయ్యారు.
మరోవైపు ఆసుపత్రిలో అపరిశుభ్రత, రోగులకు సరైన మందులు అందుబాటులో లేకపోవడం, అపరిశుభ్రమైన మరుగుదొడ్లు తదితర అంశాలపై తేజస్వీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఘోరంగా
ఆసుపత్రిలో సౌకర్యాలు చూసి ఆరోగ్య మంత్రిగా ఉన్న తేజస్వీ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ వైద్య వ్యర్థాలు, చెత్తా పేరుకుపోయి ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. అక్కడున్న మహిళలు, పలు రోగులు మంత్రికి ఫిర్యాదులు చేశారు.
మందులు అందుబాటులో లేవని, ప్రైవేటు మందుల దుకాణాల్లో కొనుక్కోవలసి వస్తోందని రోగుల బంధువులు వాపోయారు. మరుగుదొడ్లు అసహ్యంగా ఉంటున్నాయని తెలిపారు. మహిళలు ఆసుపత్రి వెలుపల ఉన్న ప్రైవేటు మరుగుదొడ్లకు వెళ్ళవలసి వస్తోందని తేజస్వీకి చెప్పారు.
సీరియస్
తక్షణమే ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని, సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని అక్కడున్న రోగులకు తేజస్వీ హామీ ఇచ్చారు. రాత్రి సమయాల్లో హెల్త్ మేనేజర్లు ఎందుకు విధులు నిర్వర్తించడం లేదని ఆసుపత్రి సిబ్బందిని తేజస్వీ ప్రశ్నించారు. తేజస్వీ యాదవ్.. తనిఖీ చేసినప్పుడు తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Covid Update: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు- 27 మంది మృతి
Also Read: Umesh Katti Passed Away: గుండెపోటుతో కర్ణాటక మంత్రి హఠాన్మరణం- ప్రధాని మోదీ దిగ్భ్రాంతి