Covid Update: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 5,379 కరోనా కేసులు నమోదయ్యాయి. 27 మంది మృతి చెందారు. ఒక్కరోజులో 7,094 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రికవరీ రేటు 98.7కు పెరిగింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.11 శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,44,72,241
- యాక్టివ్ కేసులు: 50,594
- మొత్తం మరణాలు: 5,28,030
- మొత్తం రికవరీలు: 4,38,93,590
వ్యాక్సినేషన్
దేశంలో కొత్తగా 18,81,319 కోట్ల మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 213.91 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,21,917 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
కీలక నిర్ణయం
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు కొవిడ్ టీకా (బీబీవి154/నాసల్ వ్యాక్సిన్) అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మంగళవారం తెలిపారు.
ఒక్కసారి చాలు
భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ నాసల్ స్ప్రే వ్యాక్సిన్‌ను ఒక్కసారి తీసుకుంటే చాలని నిపుణులు అంటున్నారు. ఈ నాసల్ స్ప్రే వ్యాక్సిన్‌ను 'BBV154'గా పేర్కొంటున్నారు. ప్రస్తుతం సిరంజీ ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ కంటే మెరుగ్గా ఈ నాసల్ స్ప్రే పనిచేస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఈ వ్యాక్సిన్ తయారీ కోసం ఇప్పటికే సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది.
Also Read: Umesh Katti Passed Away: గుండెపోటుతో కర్ణాటక మంత్రి హఠాన్మరణం- ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
Also Read: Suella Braverman: బ్రిటన్ హోంమంత్రిగా భారత సంతతి మహిళ