China Taiwan News: తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీకి తైవాన్ ఆతిథ్యం ఇవ్వడంపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్‌పై ఆంక్షల కొరడా ఝుళిపించింది. తైవాన్ నుంచి దిగుమతి చేసుకునే పండ్లు, చేపలపై ఆంక్షలు విధించింది. ఇక తైవాన్ ద్వీపానికి పంపనున్న ఇసుక రవాణాను నిలిపివేస్తున్నట్లు చైనా ప్రకటించింది.
వీటిపై
సిట్రస్ జాతికి చెందిన కొన్ని రకాల పండ్లు, చేపల దిగుమతిని సస్పెండ్ చేస్తున్నట్లు చైనా కస్టమ్స్ శాఖ తెలిపింది. పండ్లు, చేపల్లో క్రిమిసంహారకాలు ఎక్కువ శాతం ఉంటున్నాయని పేర్కొంది. కొన్ని ప్యాకెట్లలో కరోనా టెస్టు పాజిటివ్ వస్తుందని కస్టమ్స్ శాఖ తెలిపింది.
ముగిసిన పర్యటన
చైనా హెచ్చరించినా తైవాన్ రాజధాని తైపీలో పర్యటించారు పెలోసీ. ఆమె తైవాన్‌కు వస్తే అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చైనా హెచ్చరించినా ఆమె వెనక్కి తగ్గలేదు. పెలోసీ పర్యటన నేపథ్యంలో తైవాన్ స్ట్రైట్‌లో చైనా సైనిక విన్యాసాలు చేసింది. అమెరికా సైతం తమ ఆసియా- పసిఫిక్ కమాండ్‌ను అప్రమత్తం చేసింది.
మరోవైపు చైనా తన యుద్ధ విమానాలను తైవాన్ భూ భాగం వైపు పంపినట్లు స్థానికంగా కథనాలు వెలువడ్డాయి. చైనా హెచ్చరికల నేపథ్యంలో శ్వేత సౌధం కూడా పెలోసీని హెచ్చరించింది. ఆమె తైవాన్ వెళ్తే చైనా సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడొచ్చని తెలిపింది. అయినా పెలోసీ వెనక్కి తగ్గక పోవడంతో అమెరికా కూడా అప్రమత్తమైంది. తైవాన్ ద్వీపానికి తూర్పు వైపు తీరంలో అమెరికాకు చెందిన నాలుగు యుద్ధ నౌకలను మోహరించింది.
Also Read: Subramanian Swamy Comments: 'మోదీ మత్తులో మాట్లాడుతున్నారు'- BJP మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Also Read: Vice-Presidential Election 2022: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థికే మాయావతి జై