Viral News in Telugu: ప్రపంచంలో పవర్ ఫుల్ లీడర్స్‌లో ఒకరు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. సంచలన నిర్ణయాలు, వివాదాలతో ఫేమస్ అయిపోయారు. పైగా రష్యాకి ఎక్కువ కాలం పాటు అధ్యక్షుడిగా కొనసాగి ఓ రికార్డు సృష్టించారు. దాదాపు మూడేళ్లుగా ఆయన పేరు అంతర్జాతీయంగా మారు మోగుతోంది. ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలు పెట్టినప్పటి నుంచి ఆయన ప్రతి రోజూ ఏదో విధంగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ దేశాలైతే ఆయనను ఏకిపారేస్తున్నాయి. అమాయక పౌరులను బలి తీసుకుంటున్నారంటూ మండి పడుతున్నాయి. ఐక్యరాజ్య సమితిలోనూ చాలా సందర్భాల్లో రష్యాకి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగింది. ఇంత జరుగుతున్నా "నా దారి నాదే" అని మొండిగా ఉంటున్నారు పుతిన్. ఉక్రెయిన్‌ని హస్తగతం చేసుకునేంత వరకూ వదిలే ప్రసక్తే లేదన్నట్టుగా పట్టుదలగా ఉంటున్నారు.


అటు ఉక్రెయిన్‌ కూడా దీటుగా యుద్ధం చేస్తుండడం వల్ల ఇన్నేళ్లైనా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్‌కి అత్యంత మిత్రదేశం కావడం వల్ల మోదీ కూడా ఆయనతో చాలా సార్లు యుద్ధం గురించి మాట్లాడారు. ఇది యుద్ధాలు చేసుకునే కాలం కాదని సున్నితంగానే హెచ్చరించారు. అయినా ఆయన పట్టించుకోవడం లేదు. అయితే...ఇప్పుడు సోషల్ మీడియాలో పుతిన్‌ చిన్నప్పటి ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. అందుకే మరోసారి పుతిన్‌ వ్యక్తిగత వివరాలపై చర్చ జరుగుతోంది. (Also Read: PM Modi: అప్పుడు పుతిన్‌కి, ఇప్పుడు జెలెన్‌స్కీకి మోదీ ఆలింగనం - భారత్‌ వైఖరికి ఇది సంకేతమా?)






ఓ నెటిజన్ పుతిన్ చిన్నప్పటి ఫొటో పోస్ట్ చేసి "Who is this boy?" అనే క్యాప్షన్ ఇచ్చింది. కామెంట్స్‌లో చాలా మంది నెటిజన్లు పుతిన్ అంటూ కామెంట్స్ పెట్టారు. అంతే కాదు. ఆయన పాత వీడియోలన్నీ కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేస్తున్నారు. మరో నెటిజన్ పుతిన్‌ ప్రొఫైల్ షేర్ చేశాడు. అందులో పాత ఫొటోలున్నాయి. యవ్వనంలో ఉన్నప్పటి పుతిన్ ఫొటో ఇందులో ఉంది. అంతర్జాతీయ రాజకీయల్లో వివాదాస్పద లీడర్‌గా పేరు తెచ్చుకున్న పుతిన్ 1952 అక్టోబర్ 7వ తేదీన జన్మించారు. సోవియట్ యూనియన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీకి చెందిన KGBలో కెరీర్ ప్రారంభించి ఆ తరవాత 1990ల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2000 సంవత్సరంలో రష్యాకి ప్రధానిగా ఆ తరవాత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రష్యా అంటే పుతిన్ అనే స్థాయిలో మార్క్ చూపించారు.  






Also Read:  Israel: మా జోలికొస్తే తాట తీస్తాం, ఎంతకైనా తెగిస్తాం - హెజ్బుల్లాకి నెతన్యాహు వార్నింగ్