PM Modi: అప్పుడు పుతిన్‌కి, ఇప్పుడు జెలెన్‌స్కీకి మోదీ ఆలింగనం - భారత్ వైఖరికి ఇది సంకేతమా?
ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మోదీకి స్వాగతం పలికారు. యుద్ధం కారణంగా బలి అయిన మృతుల కోసం అక్కడ నిర్మించిన స్మారక భవనాన్ని సందర్శించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సందర్భంగా ప్రధాని మోదీ జెలెన్‌స్కీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అంతకు ముందు షేక్ హ్యాండ్ ఇచ్చారు. జెలెన్‌స్కీ విచారం వ్యక్తం చేయగా మోదీ ఆయన భుజంపై చేయి వేసి ఓదార్చారు.
ఆ భవనం బయట ఏర్పాటు చేసిన బోర్డ్‌లను చూస్తూ మోదీ విచారం వ్యక్తం చేశారు. జెలెన్‌స్కీ మోదీ పక్కనే నిలబడ్డారు. ఆ తరవాత భవనంలో యుద్ధానికి సంబంధించిన ప్రత్యేకంగా వీడియో ప్రదర్శించారు. ఆ వీడియో చూసిన మోదీ మృతులకు నివాళులు అర్పించారు.
రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎంతో మంది చిన్నారులు బలి అవ్వడంపై మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చిన్నారుల స్మారకంగా అక్కడ ఓ బొమ్మను ఉంచి శ్రద్ధాంజలి ఘటించినట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యుద్ధాల కారణంగా చిన్నారులు బలి అవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు మోదీ.
పుతిన్‌తో భేటీ అయిన సమయంలో మోదీ ఇలానే ఆయనను ఆలింగనం చేసుకున్నారు. దీనిపై జెలెన్‌స్కీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంత విధ్వంసానికి పాల్పడుతున్న వ్యక్తితో అంత సన్నిహితంగా ఎలా ఉంటున్నారని మోదీని ప్రశ్నించారు. ఇప్పుడు జెలెన్‌స్కీతోనూ అంతే సన్నిహితంగా ఉన్నారు మోదీ.
ఉక్రెయిన్‌కి స్వాతంత్య్రం వచ్చిన తరవాత ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించాలని ఎన్నో రోజులుగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇన్నాళ్లకు మోదీ అక్కడ పర్యటించారు.
జెలెన్‌స్కీతో ప్రత్యేకంగా భేటీ రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై కీలక చర్చలు జరపనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ విషయంలో మొదటి నుంచి న్యూట్రల్‌గా ఉంటున్న భారత్ ఇది యుద్ధాల కాలం కాదని తేల్చి చెప్పింది. అటు రష్యాతోనూ మైత్రి కొనసాగిస్తూనే యుద్ధాన్ని ఖండించింది.
ఈ భేటీ తరవాత మోదీ రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఏ ప్రకటన చేస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అంతర్జాతీయంగా ఈ పర్యటన ఆసక్తిని పెంచుతోంది. ఇటీవలే మోదీ రష్యాలో పర్యటించి పుతిన్‌తో భేటీ అయ్యారు.