Megha Akash: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న యంగ్ హీరోయిన్... పెళ్లి కొడుకు ఎవరో తెలుసా?
హీరోయిన్ మేఘా ఆకాష్ గుర్తు ఉన్నారా? నితిన్ 'లై' సినిమాతో కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 'చల్ మోహన్ రంగ', 'రాజరాజ చోర', 'డియర్ మేఘ' వంటి సినిమాలు చేశారు. తమిళంలోనూ రజనీకాంత్ 'పేట'లో నటించారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట పెళ్లి సందడి నెలకొంది. త్వరలో ఆమె వివాహం జరగనుంది. ఈ గురువారం మేఘా ఆకాష్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. (Image Courtesy: meghaakash / Instagram)
మేఘా ఆకాష్ మెడలో మూడు ముళ్లు వేయబోయే వరుడు, ఆమెతో ఏడు అడుగులు నడిచే వ్యక్తి ఎవరో తెలుసా? సాయి విష్ణు. అవును... ఆమెకు కాబోయే భర్త పేరు అదే. ఆగస్టు 22న సాయి విష్ణు, మేఘా ఆకాష్ నిశ్చితార్థం జరిగింది. వాళ్లిద్దరూ ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు. (Image Courtesy: meghaakash / Instagram)
తమది ప్రేమ వివాహం అని మేఘా ఆకాష్ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో 'నా కల నిజమైంది. 'Engaged to the love of my life' అని ఆవిడ చెప్పారు. అయితే, ఇంకా పెళ్లి తేదీ అనౌన్స్ చేయలేదు. (Image Courtesy: meghaakash / Instagram)
పెళ్లి తర్వాత కూడా మేఘా ఆకాష్ సినిమాలు చేసే అవకాశం ఉంది. ఆవిడ నటించిన 'సకుటుంబానాం' విడుదలకు సిద్ధమైంది. (Image Courtesy: meghaakash / Instagram)